సబ్ కలెక్టర్ ఆఫీసు ఎఫెక్ట్, ఆ ముగ్గురు ఔట్, క్యూలో బాధితులు, ఏం చేశారు తెలుసా ?

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగలేదని, కావాలనే ఫైళ్లకు నిప్పంటించారని అధికారుల ఉన్నతస్థాయి దర్యాప్తులో వెలుగు చూసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలంలో మంటలు వ్యాపించడానికి అధికారులే పరోక్షంగా కారణం అయ్యారని వెలుగు చూడటం కలకలం రేపింది. సబ్ కలెక్టర్ కార్యాయానికి నిప్పంటించి రికార్డులు కాలిపోవడానికి కారణం అయ్యారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మదనపల్లె ఆర్డీఓ హరి ప్రసాద్, గతంలో మదనపల్లెలో ఆర్డీఓగా పని చేసి ప్రస్తుతం తిరుపతి కలెక్టర్ ఆఫీసులో విదులు నిర్వహిస్తున్న ఆర్డీఓ మురళి, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ అలియాస్ గౌతమ్ ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ, సిసోదియా ఆదేశాలు జారీ చేశారు. ఇంకా కొంత మంది అధికారులు, ఉద్యోగులను విచారణ చేస్తున్నారని, మరికొంత మందిపై వేటుపడే అవకాశం ఉందని తెలిసింది.

Three revenue officers suspended in Madanapalle sub collector s office fire case
ఈనెల 21వ తేదీ ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించి అనేక ఫైళ్లు ఖాళి బూడిద అయ్యాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంప్యూటర్ రూమ్ లో మంటలు వ్యాపించడంతో 25 రన్నింగ్ ఫైల్స్ ఖాళి బూడిద అయ్యాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మదనపల్లె చేరుకుని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించి ఆయనే స్వయంగా దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగలేదని, కావాలనే ఎవరో నిప్పంటించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూరసిందని ఇటీవల డీజీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు, డీజీపీ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, పోలీసు శాఖ ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు నివేదికల ఆధారంగా ముగ్గరు రెవెన్యూ శాఖ అధికారుల మీద వేటుపడింది. ఇంకా కొంత మంది రెవెన్యూ శాఖ ఉద్యోగులను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

Three revenue officers suspended in Madanapalle sub collector s office fire case

మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆయన సొంత సోదరుడు, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు మా భూములు బలవంతంగా లాక్కొన్నారని, మమ్మల్ని వేధించారని బాదితులు సోమవారం కూడా మదనపల్లె సబ్ కలెక్టర్ కు ఫిర్యాదులు చేశారు. మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటిలో కూడా పోలీసులు సోదాలు చేశారు.

గత వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు మాధవ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నా ఆయన ఆచూకి మాత్రం చిక్కడం లేదని తెలిసింది. మొత్తం మీద మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసు మదనపల్లె, తిరుపతి, పుంగనూరు, హైదరాబాద్ లో దర్యాప్తు చేస్తున్న అధికారులు త్వరలో ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+