ఎపి సచివాలయంలో పిట్టగోడ ఇటుకలు కూలి ముగ్గురికి గాయాలు (ఫొటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయం పిట్టగోడ ఇటుకలు కూలి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో భాగంగా సచివాలయంలో సోమవారం పనులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

వర్షం తాకిడికి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన నిర్మాణంలో ఉన్న పిట్టగోడ ఇటుకలు ఒక్కొక్కటిగా కూలడంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. సీఆర్డీఏ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కార్మికులను సమీపంలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన రాంచరణ్ (36), ధర్మేంద్ర రామ్ (30), కిషోర్ చౌదరి (49) ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కార్మికులు హెల్మెట్లు ధరించకపోతే ప్రాణాపాయం జరిగి ఉండేదని ఫస్ట్‌బ్లాక్‌లో పనిచేస్తున్న కార్మికులు అంటున్నారు. కాగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఎన్నారై వైద్యులు ప్రకటించారు.

ఈదురు గాలులతో...

ఈదురు గాలులతో...

వర్షంతో కూడిన ఈదురు గాలులు రావడంతో వెలగపూడిలోని ఎపి సచివాలయంలో పిట్టగోడ ఇటుకలు కూలి ప్రమాదం సంభవించింది.

ఆస్పత్రిలో చిక్సిత్స

ఆస్పత్రిలో చిక్సిత్స

ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఎన్నారై ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఓ కార్మికుడు ఇలా...

మరో కార్మికుడు...

మరో కార్మికుడు...

ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన మరో కార్మికుడు ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా...

హెల్మెట్లు పెట్టుకోకపోయి ఉంటే....

హెల్మెట్లు పెట్టుకోకపోయి ఉంటే....

కార్మికులు పనిచేస్తుండగా ప్రమాదం సంభవించింది. కార్మికులు పనిచేస్తున్న సమయంలో హెల్మెట్లు ధరించకపోయి ఉంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేదని అంటున్నారు.

ఇలా కూలిన దృశ్యం

ఇలా కూలిన దృశ్యం

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కార్మికులు పనిచేస్తుండగా పిట్టగోడ ఇటుకలు కూలి ప్రమాదం సంభవించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three Jharkhan workers injured in accident at Velagapudi Andhra Pradesh secretariat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి