ముహూర్తం ఖరారు: టిఆర్ఎస్‌లోకి తుమ్మల, నేతలు!

Thummala likely to join in TRS
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో త్వరలోనే చేరనున్నారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా పార్టీలో చేరనున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన ఆయన తొమ్మిదేళ్ళ పాటు మంత్రిగా కూడా పని చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఆయన గడిచిన ఎన్నికల్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావుతో ఏర్పడిన విభేదాల కారణంగా ఓటమి చెందినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

గడిచిన ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ నామా నాగేశ్వరరావు తన అనుచరురాలైన స్వర్ణకుమారికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావటంతో తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అంతకుముందు నుంచే ఇరువురి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంలో చంద్రబాబు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, 150 మంది సర్పంచ్‌లు, 140 మంది ఎంపిటిసిలు, 15 మంది జడ్పీటిసిలు టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+