కర్నూల్లో చిరుత భయం, చెత్తలో శిశువు మృతదేహం
విజయవాడ: రాయలసీమ జిల్లాలో చిరుత పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లాలోని కొసరి మండలం చిత్తన్నకల్లులో ఓ చిరుత హల్‌చల్ చేసింది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువకులపై చిరుత దాడికి యత్నించింది.
దీంతో భయాందోళనకు గురైన యువకులు గ్రామంలోకి పరుగులు తీశారు. అటు అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో రెండు మేకలను చిరుత చంపండంతో గ్రామస్థులు భయాందోళ చెందుతున్నారు. చిరుత పులి సంచారంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.

లారీ ఢీకొని ఐదుగురి మృతి
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం పెద్ద చెరువు దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీని కారు ఢీకొన్నడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు దగదర్తి మండలం గట్టుపూడికి చెందినవారిగా గుర్తించారు.
చెత్తకుండీలో శిశువ మృతదేహం
కర్నూలు జిల్లాలోని కలెక్టరేట్ ముందున్న చెత్తకుండీలో శిశువు మృతదేహం దొరికింది. శుక్రవారం ఉదయం చెత్తకుండీని శుభ్రం చేస్తున్న సమయంలో పసికందు మృతదేహం బయటపడింది. ఆ శిశువును ఖననం చేశారు.












Click it and Unblock the Notifications