Tiger: ఆకలి మీదున్న పెద్దపులి, అప్రమత్తంగా లేకుంటే మనం బలి
తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత ఐదు రోజులుగా ఒకే ఒక్క భయం వెంటాడుతోంది. పెద్దపులి సంచారం రోజుకో మలుపు తీసుకుంటూ, గ్రామం నుంచి గ్రామానికి విస్తరిస్తోంది. పశువులపై వరుస దాడులతో ఇప్పటికే ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. ప్రజలు నిద్ర, ఆహారం మరిచి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మంగళవారం రఘునాథపురంలో పశువును చంపిన పులి, బుధవారం రాత్రి రాజానగరం మండలంలో మళ్లీ పంజా విసిరింది. పుణ్యక్షేత్రం - జి.యర్రంపాలెం గ్రామాల మధ్య మూడు ఆవులు, ఒక దూడను బలితీసుకుంది. ఒక పామాయిల్ తోటలో ఒక ఆవు, అనంతరం మరో తోటలో రెండు ఆవులు, దూడను చంపినట్లు అటవీశాఖ నిర్ధారించింది.

మత్తు ఇంజెక్షన్‌తో..
బుధవారం ఉదయం గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో, అటవీశాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులిని బంధించేందుకు పుణే, ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది. పులి జాడ దొరికితే మత్తు ఇంజెక్షన్‌తో ట్రాంక్విలైజ్ చేసి పట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పులి కదలికలు..
ఇదే పెద్దపులి గత రెండు రోజులుగా కొవ్వూరు మండలం చిడిపి, ఆరుకురేవుల గ్రామాల పొలాల్లో పాదముద్రలు వదిలినట్లు స్థానికులు గుర్తించారు. అలాగే తొర్రేడు పరిసర ప్రాంతాల్లో పులి కనిపించినట్లు అటవీశాఖ ధ్రువీకరించింది. దీంతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. సీతానగరం గోదావరి లంకల్లో కూడా పులి సంచారం ఉన్నట్లు అడుగుజాడల ద్వారా నిర్ధారణ కావడంతో, లంక గ్రామాల్లో భయాందోళన నెలకొంది. అక్కడి నుంచి పులి కదలికలు కోరుకొండ మండలం గాడాల వరకు విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు.
అడవుల వైపు కదులుతుందా?
భయాన్ని మరింత పెంచిన ఘటనగా, రాజమండ్రి దివాన్ చెరువు SVPC ఫంక్షన్ హాల్ సమీపంలో పులి సీసీ కెమెరాల్లో కనిపించడం కలకలం రేపింది. నగర శివార్ల వరకు పులి చేరడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పులి దివాన్ చెరువు అడవిలోకి వెళ్తుందా? లేక రంపచోడవరం - మారేడుమిల్లి అడవుల వైపు కదులుతుందా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా 24/7 పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గస్తీ పెంచారు.
ప్రజలకు కీలక హెచ్చరికలు
- పొలాలకు, లంక ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దు
- ఉదయం, రాత్రి వేళల్లో గుంపులుగా మాత్రమే వెళ్లాలి
- పశువులను రాత్రి వేళ బయట విడిచిపెట్టవద్దు
- పులి జాడలు, కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలి
- అటవీశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలి
పెద్దపులి ఇంకా పట్టుబడని నేపథ్యంలో, తూర్పుగోదావరి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం హెచ్చరిక కాదు - ప్రాణ భద్రతకు సంబంధించిన అలర్ట్.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications