Tiger: వామ్మో పెద్దపులి ఎలా వచ్చిందో చూడండి. బయటకు రాకండి
అడవులకే పరిమితమవ్వాల్సిన పెద్దపులి (Tiger) క్రమంగా జనావాసాల వైపు కదులుతుండటంతో గ్రామస్థుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. పులి కదలికలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు రాత్రిళ్లు నిద్రాహారాలు మానుకుని అప్రమత్తంగా గడుపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన చిడిపి, ఆరుకురేవుల గ్రామాల పరిసర పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. రెండు రోజుల క్రితం తొర్రేడు ప్రాంతం చుట్టుపక్కల పెద్దపులి కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Tiger కదలికలపై నిఘా..
ఈ ఘటనల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఇదే పెద్దపులి సీతానగరం మండలంలోని గోదావరి లంక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కూడా అడుగుజాడల ఆధారంగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. లంక గ్రామాల్లో పులి సంచారం వార్తలతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. పశువుల మేతకు వెళ్లడానికీ, వ్యవసాయ పనులకు వెళ్లడానికీ గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
సీతానగరం నుంచి ప్రారంభమైన పెద్దపులి కదలికలు కోరుకొండ మండలం గాడాల ప్రాంతం వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తొర్రేడు వద్ద పశువులపై దాడి జరగడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి మరింతగా గ్రామాల వైపు వస్తుందా, లేక అటవీ ప్రాంతాల్లోకి మళ్లుతుందా అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య రాజమండ్రిలోని దివాన్ చెరువు ప్రాంతంలో కలకలం రేగింది. దివాన్ చెరువు ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పెద్దపులి సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ పరిధిలోకి కూడా పెద్దపులి చేరిందన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
బయటకు రాకండి, రాత్రి వేళల్లో జాగ్రత్త..
అటవీ శాఖ అధికారులు గస్తీని పెంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రాకుండా, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులి దివాన్ చెరువు అడవుల్లోకి వెళ్లే అవకాశముందా, లేక రంపచోడవరం - మారేడుమిల్లి అటవీ ప్రాంతాల వైపు కదులుతుందా అన్న కోణంలో అధికారులు దృష్టి సారించారు.
పులి కదలికలపై స్పష్టత కోసం డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే పులి అడవుల్లోకి వెళ్తుందో, లేక జనావాసాలపై ముప్పుగా మారుతుందో తెలియక తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు భయంతో అప్రమత్తంగా గడుపుతున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications