వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల వాతార‌ణం పూర్తిగా వ‌చ్చేంత వ‌ర‌కు జ‌నంలోనే జ‌గ‌న్..!!

|
Google Oneindia TeluguNews

వైసీపి అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర అప్ర‌తిహ‌తంగా కొన‌సాగ‌బోతోంది. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే పాద‌యాత్ర‌లో మార్పులు చేయొచ్చ‌నుకున్న వైసీపి బ్రుందానికి ఆ అవ‌స‌రం వ‌చ్చేలా క‌నిపించ‌డంలేదు. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్విరామంగా కొన‌సాగించేందుకు, అవ‌స‌రం అనుకుంటే 2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ పాద‌యాత్ర కొన‌సాగించేందుకు జ‌గ‌న్ సిద్ద‌ప‌డుతున్నారు. పాద‌యాత్ర ద్వారా వ‌చ్చిన మైలేజ్ ని ఎన్నిక‌ల వ‌ర‌కూ తీసుకెళ్లానేదే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది. అప్పుడ‌ప్పుడూ జ‌నంలోకి వ‌చ్చేక‌న్నా నిత్యం జ‌నంలో ఉంటే ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌నేది జ‌గస్ ప్ర‌ణాళిక‌. జ‌గ‌న్ తో పాటు పార్టీ నాయ‌కుల‌ను కూడా పాద‌యాత్ర‌లో మ‌మేకం చేసేందుకు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది

విరామం వ‌ద్దు..! విజ‌యం వ‌రించే వ‌ర‌కు జ‌నంతోనే జ‌గ‌న్..!!

విరామం వ‌ద్దు..! విజ‌యం వ‌రించే వ‌ర‌కు జ‌నంతోనే జ‌గ‌న్..!!

జగన్ తన పాదయాత్రను పొడిగిస్తూ వస్తున్నారు. ఇది ఏడాదిపాటు కొనసాగనుందని తెలుస్తోంది. గత ఏడాది నవంబరు 6వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఇప్పటికి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయింది. ఇక్కడి నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటించాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప పాదయాత్రను ముగించాలని వైసీపీ వర్గాలు నిర్ణయించాయి. ముందుగా అనుకున్న ప్రకారం పాదయాత్రను ఏడు నెలల్లో పూర్తి చేయాల్సివుంది. గత నవంబరులో ప్రారంభమై మే, జూన్ నాటికల్లా పాదయాత్రను ముగించాలని ముందుగా భావించారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు.. ఇక జ‌నంలోనే కార్యాచ‌ర‌ణ‌..

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు.. ఇక జ‌నంలోనే కార్యాచ‌ర‌ణ‌..

పాదయాత్ర ద్వారా సుమారు 126 నియోజకవర్గాలను పూర్తి చేసి మిగిలిన నియోజకవర్గాలను బస్సుయాత్ర ద్వారా పర్యటించాలని నిర్ణయించారు. ఎన్నికలు ముందుగానే వస్తాయని భావించి, అందుకు అనుగుణంగా ఈ పాదయాత్ర రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది డిసెంబరులోనే ఎన్నికలు వస్తాయని కొంతకాలం క్రితం వరకూ అందరూ భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మైత్రి బెడిసికొట్టడంతో పాటు, ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.

నాయ‌కుడితోపాటు స్థానికి నేత‌లు కూడా జ‌నంలో ఉండాలి..! అదే గెలిపించాలి..!

నాయ‌కుడితోపాటు స్థానికి నేత‌లు కూడా జ‌నంలో ఉండాలి..! అదే గెలిపించాలి..!

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా తాము షెడ్యూల్ ప్రకారమే వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్, మేనెలల్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని తెలియడంతో జగన్ పాదయాత్రను నెమ్మదిగా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపద్యంలో ప్రతి సామాజిక వర్గాన్ని కలుసుకోవడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కావడానికే జగన్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలుస్తోంది.

జ‌నంతోనే జ‌గ‌న్..! ఇదే వైసీపి ఎజెండా..!!

జ‌నంతోనే జ‌గ‌న్..! ఇదే వైసీపి ఎజెండా..!!

ఈనెల 13, 14 తేదీల్లో జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఇక్కడి నుంచి కొనసాగే జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నవంబరు నెలాఖరు గాని, డిసెంబరు మొదటి వారంలో గాని ఇచ్ఛాపురం చేరుకోవచ్చని వైసీపీ భావిస్తోందని తెలుస్తోంది. దీనికితోడు పాదయాత్రను నింపాదిగానే సాగనివ్వాలని, త్వరగా ముగించేలా ప్లాన్ చేయవద్దని జగన్ నిర్వాహకులకు సూచించారని సమాచారం. ఇదేవిధంగా పాదయాత్ర కొనసాగితే జగన్ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్తానిక నాయ‌క‌త్వం కూడా పార్టీ కార్యాల‌యాల్లో కూర్చునే బ‌దులు ప్ర‌జ‌ల మ‌ద్య‌న ఉంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ప్లాన్ చేస్తోంది వైసీపి. పూరి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం రాష్ట్రాన్ని క‌మ్మేసేంత వ‌ర‌కూ పాద యాత్ర చేసేందుకే జ‌గ‌న్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
ysrcp chief jagan mohan reddy planing to continue his padayatra till 2019 general elections. meanwhile he thought he should end the padayatra for advanced elections. but there is no sign of advanced elections from the central government thats why jagan wants to continue his praja sankalpa yatra 3 more months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X