వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజుల్లోనే మార్చలేం: వెంకయ్య, జగన్‌పార్టీ నేత హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: యూపీఏ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేశారని, దీనిని పది రోజుల్లోనే మార్చడం సాధ్యం కాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. 2022నాటికి అందిరకీ ఇళ్లు తమ లక్ష్యమని చెప్పారు. 43.3 శాతం డబ్బులు ప్రపంచ బ్యాంకు వడ్డీకే సరిపోతుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు లేకుండా చూస్తామన్నారు. 2020 నాటికి విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు గత యూపీఏ సర్కారు తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆరోపించారు.

తిరుపతి రైల్వే స్టేషన్‌ను త్వరలోనే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఆదివారం తిరుపతిలో జరిగిన పార్టీ సీమ నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Time will take to change: Venkaiah

నిరుద్యోగులకు ఉచిత వైద్యం: కామినేని

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సందర్శించారు. స్విమ్స్‌లో బ్లడ్ బ్యాంక్ ను, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ.. కర్నూలులో రూ.45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు తెస్తామని, త్వరలో ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ హెల్త్ కార్డుగా మారుస్తామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ కార్డులతో నిరుద్యోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు కామినేని చెప్పారు. అంతకుముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యే హంగామా

చిత్తూరు జిల్లాలోని పాకాల సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి హంగామా చేశారట. స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో ఆలయ ఛైర్మన్ ఆనంద చౌదరితో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది.

English summary
Union Minister Venkaiah Naidu on Sunday said time will take to change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X