ఏపీలో ప్రజలు ఎవరి వైపు, ఎవరికెంత మద్దతు - తేల్చిన జాతీయ సంస్థ సర్వే..!!
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీరు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఎన్నికల్లో గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నవ్ - నవభారత్ సర్వే లో ఆసక్తి కర ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు..ఏ పార్టీకి ఏంత మేర ఓటింగ్ శాతం ఉందనేది సర్వే విశ్లేషించింది.
టైమ్స్ నవ్ నవభారత్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి తిరిగి పట్టం కట్టేందకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సర్వే సంస్థ వెల్లడించింది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. అనూహ్యంగా వైసీపీ ఈ సర్వే అంచనాలను చూస్తే లోక్ సభలో అతి పెద్ద మూడో పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్ సభ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 22 స్థానాలు..టీడీపీకి మూడు స్థానాలు దక్కాయి. కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి వైసీపీ 24-25 సీట్లు గెలుస్తుందని విశ్లేషించింది. టీడీపీ 0-1 స్థానంకే పరిమితం అవుతుందని అంచనా వేసింది.

ఓట్ల షేరింగ్ పరంగా పార్టీల వారీగా సర్వే విశ్లేషించింది. వైసీపీకి 51.30 శాతం, టీడీపీ 6.20 శాతం, జనసేనకు 10.10 శాతం, బీజేపీకి 1.30 శాతం..ఇతరులకు 10 శాతం మేర ఓట్లు వస్తాయని అంచనా వేసింది. వైసీపీకి 2019 ఎన్నికల కంటే కొంత మేర పెరుగుదల కనిపిస్తోంది. నాలుగున్నారేళ్ల పాలన తరువాత కూడా వైసీపీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదని ఈ సర్వే ద్వారా స్పష్టం అవుతోంది. టీడీపీ..,జనసేన ఓట్ బ్యాంక్ కలిపి 26.30 శాతంగా పేర్కొన్నారు. దీని ద్వారా రెండు పార్టీలు కలిసి పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగినా వైసీపీ కంటే వెనుకబడి ఉన్నాయని సర్వే స్పష్టం చేస్తోంది. లోక్ సభ సీట్ల వరకు టీడీపీ కంటే జనసేన వైపు ఓటర్లు మొగ్గు చూపిస్తున్నట్లు సర్వేలో విశ్లేషించారు. రెండు పార్టీలకు వేర్వేరుగా ఓటింగ్ శాతాలను సర్వేలో వెల్లడించారు.
తెలంగాణలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. బీఆర్ఎస్ కు 37.10 శాతం మంది ప్రజలు మద్దతుగా నిలిచారు. బీజేపీకి 25.30 శాతం, కాంగ్రెస్ కు 29.20 శాతం మంది మద్దతు ఉన్నట్లు తేల్చారు. దీని ద్వారా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పంజుకుందని జరుగుతున్న ప్రచారం ఈ సర్వే ఫలితాల్లో కొంత మేర స్పష్టం అవుతోంది. మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓటింగ్ కు పరిమితం అయిన బీజేపీ..తెలంగాణీలో 25.30 శాతం గా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రజా మద్దతు ద్వారా తిరిగి రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలే తిరిగి అధికారంలోకి వస్తామని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications