ఏపీలో ఊరూవాడా తిరంగా ర్యాలీలు-పహల్గాం మృతులకు సంఘీభావంగా..!
పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలుపుతూ, ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పిలుపు మేరకు తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఉగ్రదాడి మృతులకు సంతాపాలు తెలియజేస్తున్నారు. అలాగే ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికీ, సైన్యానికి అండగా ఉంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
నిడదవోలులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో పాటు భారీగా ప్రజలు పాల్గొన్నారు. కశ్మీర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని మంత్రి దుర్గేష్ తెలిపారు. తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిడదవోలులో గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సువిశాల భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదటన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి దుర్గేష్ కొనియాడారు.

మరోవైపు ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన తిరంగా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తో పాటు భారీగా జనం పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన భారత సైన్యం సత్తా ఏమిటో పాకిస్తాన్ కు అర్థమైందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత సైన్యాన్ని కీర్తిస్తూ దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా ర్యాలీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications