తిరుమల డిక్లరేషన్ రగడ... జగన్ కు పురందేశ్వరి సంచలన డిమాండ్!

తిరుమల శ్రీవారి లడ్డు జంతువుల కొవ్వుతో, చేప నూనెతో కల్తీ అయిందని, శ్రీవారి లడ్డును తయారు చేయడానికి వినియోగించిన నెయ్యి కల్తీ జరగడంతో స్వామివారికి అపచారం జరిగిందని, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దుమారం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఈ వ్యవహారం పైన ఏపీలోని ఎన్డీఏ కూటమి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తున్నాయి.

తిరుమలకు జగన్.. ఏపీలో డిక్లరేషన్ పై చర్చ
ముఖ్యంగా జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో తాను కూడా తిరుమల శ్రీవారి భక్తుడిని అంటూ పేర్కొన్న జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నానంటూ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇక ఈ ప్రకటన ఏపీలో కొత్త చర్చకు కారణంగా మారింది. తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోవడానికి వెళ్తానని చేసిన వ్యాఖ్యలతో జగన్ మతం పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

Tirumala Declaration controversy BJP AP President Purandeswari sensational demand to YS Jagan

జగన్ డిక్లరేషన్ పై దగ్గుబాటి పురందేశ్వరి
అన్యమతస్తులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వెళితే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, జగన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళితే కచ్చితంగా టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా స్పష్టం చేశారు.

తిరుమలలో దశాబ్దాలుగా ఆ ఆచారం
డిక్లరేషన్ ఇచ్చి తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని ఆమె జగన్ ను డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ నెల 28వ తేదీన జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు . తిరుమలలో దశాబ్దాలుగా అన్యమతస్తులు స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించే ఆచారం ఉంది.

అలిపిరిలోని గరుడ విగ్రహం వద్ద ఆ పని చెయ్యాలన్న పురందేశ్వరి
AP రెవెన్యూ ఎండోమెంట్స్--1, రూల్ నంబర్ 16 యొక్క G.O. MS NO- 311 ప్రకారం, హిందువులు కానివారు విశ్వాస రూపంలో దర్శనానికి ముందు టీటీడీ సాధారణ నిబంధనలు రూల్ 136 ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో అడుగు పెట్టక ముందే అలిపిరిలోని గరుడ విగ్రహం వద్ద తన విశ్వాసాన్ని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని ఆమె తన పోస్టులో వెల్లడించారు.

జగన్ ఏం చేస్తారు?
జగన్ అన్యమతస్తులు కావడంతో ఈ డిక్లరేషన్ ఫామ్ ని పూర్తి చేసిన తర్వాతే వెళ్లాలని పేర్కొంటూ డిక్లరేషన్ ఫామ్ ని కూడా పురందేశ్వరి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం డిక్లరేషన్ పై జగన్ పైన, బీజేపీతో పాటు, హిందూ సంఘాలు టార్గెట్ చేస్తున్న వేళ జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే స్వామిని దర్శించుకుంటారా..లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+