మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే
తిరుమలలో హిందువేతరుల డిక్లరేషన్, సతీసమేతంగా ప్రభుత్వాధినేతలు పట్టువస్త్రాలు సమర్పించాలనే అంశాల నేపథ్యంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్లపై వివాదం రోజురోజుకూ పెద్దదవుతుండటంతో అధికార వైసీపీ నష్టనివారణ చర్యలకు దిగింది. డిక్లరేషన్ వ్యవహారం జోలికి పోకుండానే.. ప్రధాని నరేంద్ర మోదీపై నాని చేసిన కామెంట్లను పార్టీ తప్పుపట్టింది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం.. ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాల వల్లే వైసీపీ ఈ తరహా ప్రకటనలు చేయాల్సివచ్చిందని చెబుతోంది.

నానికి సజ్జల హితవు..
మంత్రి కొడాలి నానిని కలియుగ శిశుపాలిడిగా అభివర్ణిస్తూ.. వందసార్లు మోదీని దూషించే దాకా ఓపిక పడతామని, ఇప్పుడు జనగ్.. చంద్రబాబులా తన పతనాన్ని కోరి తెచ్చుకుంటారో, లేక తప్పులు గుర్తించి నానిని తొగిస్తారో వేచిచూస్తామంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్లు చేసిన కొద్ది సేపటికే.. నాని కామెంట్లను వైసీపీ గర్హించడం గమనార్హం. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రినానికి హితవుపలికారు.

అలా మాట్లాడటం సరికాదు..
ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను సజ్జల తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధాని అని, ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని, అయితే ప్రస్తుత వివాదంపై కొడాలి వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని సజ్జల స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎవరైనా సరే, మోదీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని, నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. అదేసమయంలో ప్రతిపక్ష టీడీపీపైనా సజ్జల ఓ రేంజ్ లో ఫైరయ్యారు.

ఆలయాలపై దాడుల వెనుక..
అమరావతి భూ కుంభకోణం నుంచి దృష్టి మరల్చడానికే మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తున్నదని, హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ఆ పార్టీ దుష్టపన్నాగమే ఉందని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే అధికారం కోల్పోయామన్న దుగ్ధతోనే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని, మతాలను అడ్డం పెట్టుకుని సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయం ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని, ఇలాంటి చర్యలతో ఆ పార్టీలు ప్రజల్లో చులకనైపోతారని సజ్జల అన్నారు. ఇదిలా ఉంటే..

కొడాలిపై ఢిల్లీ ఆగ్రహం?
ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని వ్యక్తలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు ఎందుకంటే సజ్జల ప్రోత్సాహంతోనే కొడాలి నాని పూనకం వచ్చినట్లు పచ్చిబూతులు మాట్లాడుతారని, ఆ క్రమంలోనే ప్రధాని మోదీని కించపరిచే వ్యాఖ్యలు చేశారని వర్ల అన్నారు. ‘‘ఇప్పుడు ఢిల్లీ సీరియస్ అయ్యే సరికి, మంత్రి నానికి చదువు సంధ్యలు లేవని, అవగాహన లేక అటువంటి వ్యాఖ్యలు చేశారని, అతన్ని క్షమించండి అని ప్రధాని కార్యాలయం తో బేరాలాడుతున్నారు'' అని టీడీపీ నేత ట్వీట్ చేశారు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications