తిరుమల లడ్డు కల్తీపై పవన్ కళ్యాణ్ హంగామా వెనుక ఆయన.. రోజా సంచలనం!
మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు పెద్ద స్వార్థపరుడు అన్న రోజా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందరినో బలితీసుకొన్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు తిరుమల లడ్డుని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బజారుకీడ్చి అపవిత్రం చేస్తున్నాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేవుడితో ఆటలాడుతున్న చంద్రబాబు: రోజా
చంద్రబాబు తిరుమల పవిత్రతను బ్రష్టు పట్టిస్తున్నాడని, దేవుడితో ఆటలాడుతున్నాడని రోజా నిప్పులు చెరిగారు. నేడు మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న రోజా తమిళ మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలకోసం సొంతమామ ఎన్టీఆర్ నే బలి తీసుకొన్నాడని, తర్వాత తోడల్లుడు దగ్గుబాటిని, బామ్మరిది హరికృష్ణ, అతని కొడుకు జూనియర్ ఎన్టియార్ లను కూడా బలి తీసుకొన్న చరిత్ర చంద్రబాబుదన్నారు.

చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అలవిగాని హామీలు ఇచ్చాడని మండిపడ్డారు. అబద్దాలు చెప్పి జనాన్ని మభ్య పెట్టాడు. ఈవియంలను మ్యానేజ్ చేసి గెలిచాడని ఆరోపించారు. గెలిచాక హామీలను తుంగలో తొక్కి జనాన్ని మోసం చేశాడు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉంటే తను భవిష్యత్ లో సియం కాలేనని భావించి రాష్ట్రాన్నే ముక్కలు చేశాడని, చంద్రబాబు కుట్ర దారుడని రోజా మండిపడ్డారు.
లడ్డూ వివాదం తెరమీదకు తెచ్చిన చంద్రబాబు
చంద్రబాబు సీఎం అయిన 100 రోజుల్లోనే అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరదల సమయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని రోజా విమర్శించారు. జనం వరదల ఫెయిల్యూర్ పై చంద్రబాబుపై ఆగ్రహంతో రోడ్డెక్కారని, దాని నుండి దృష్టి మరల్చటానికి లడ్డూ వివాదం తెరమీదకు తెచ్చారని రోజా ఆరోపించారు.
లడ్డూ కల్తీతో జగన్ కు ఏం సంబంధం?
జగన్ పాలన ముగిశాక వచ్చిన నెయ్యితో లడ్డూ కల్తీతో జగన్ కు ఏం సంబంధం అంటూ రోజా మండిపడ్డారు. వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలి గానీ, ఇలా లడ్డూపై తప్పుడు ప్రచారంచేసి తిరుమల పవిత్రతను బజారుకీడ్చడం ఏమిటి? అని రోజా ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు, పవన్ పై @RojaSelvamaniRK ఘాటు విమర్శలు#Roja #RojaSelvamani #RKRoja #CMChandrababu #Chandrababu #PawanKalyan #TirupatiLaddu #Oneindiatelugu pic.twitter.com/BGT2PF1KfW
— oneindiatelugu (@oneindiatelugu) September 28, 2024
చంద్రబు కచ్చితంగా ఫలితం అనుభవిస్తాడు
ఆలయ ఈవో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్తున్న, చంద్రబాబు మాత్రం ఫేక్ రిపోర్టులు సృష్టించి లడ్డూ కల్తీ అయ్యిందని దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. దాన్ని జగన్ పై నెట్టి రాజకీయలబ్ది పొందడానికి చీప్ ట్రిక్స్ చేస్తున్నాడన్నారు. చంద్రబాబుకి దేవుడంటే భక్తి, భయం ఏమీ లేదు.. దేవుడంటే లెక్కే లేదన్న రోజా చంద్రబాబు ఎప్పుడు పూజలకెళ్ళినా బూట్లు వేసుకొనే వెళతాడు. ఇప్పుడు దేవుడినే అవమానిస్తూ ఆటలాడుతున్నాడని కచ్చితంగా ఫలితం అనుభవిస్తాడని శాపనార్ధాలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతాడు?
చంద్రబాబు తాను ఆడుతున్న డ్రామా జనాలకు అర్ధమై అసహ్యించుకోవటంతో తెరమీదకు పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చారని, ఆయనభార్య క్రిస్టియన్, పిల్లలు క్రిస్టియన్స్, ఆయన కూడా బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. అలాంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటి అంటూ రోజా ప్రశ్నించారు. ఈ ఘటనపై తమకు ఉన్న అనుమానాల నేపధ్యంలో సీబీఐ ఎంక్వైరీకి తామే డిమాండ్ చేస్తున్నామన్నారు రోజా.












Click it and Unblock the Notifications