Tirumala : శ్రీవారి సన్నిధిలో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఫ్యామిలీ..
కలియుగ వైకుంఠం దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కొలిచేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతి దర్శానినకి వెళ్తుంటారు. ఇక్కడికి సాధారణ భక్తులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. ఇక, తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసారు. మహేష్‌బాబు కుటుంబం నేటి (గురువారం) ఉదయం తిరుమలకు వచ్చారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కొడుకు గౌతమ్, కూతురు సితార కలిసి స్వామివారికి దర్శన భాగ్యం పొందారు. ఇక, వీరితో పాటు మేఘా ఇంజినీరింగ్ కంపెనీల అధినేత కృష్ణారెడ్డి కూడా మేఘా సుధారెడ్డి కూడా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు విచ్చేసరాస స్వామివారిని దర్శించుకున్నారు.
నిన్న (బుధవారం) రాత్రి సమయంలో మహేశ్ బాబు భార్య నమ్రత గౌతమ్, సితారతో కలిసి అలిపిరి మార్గం నుంచి కాలినడకన తిరుమల ఆలయానికి చేరుకున్నారు. తిరుమల చేరుకున్న తర్వాత వీరు తమ మొక్కులను చెల్లించుకున్నారు.

ఇక, ఆరోజు రాత్రంత అక్కడే ఉండి నేటి ఉదయం తిరుమల స్వామివారి దర్శన భాగ్యం పొందారు. గురువారం ఉదయం తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న మహేష్‌బాబు కుటుంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన టిక్కెట్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలతో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.













Click it and Unblock the Notifications