తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో అత్యధిక భక్తులు సందర్శించిన రెండో ఆలయంగా తిరుమల: మొదటిది ఏదంటే?

|
Google Oneindia TeluguNews

తిరుపతి: దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్వించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి శ్రీవారి దేవస్థానం రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న కాశీ విశ్వనాథ ఆలయం నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు ఈ మేరకు వెల్లడించింది.

మొదట కాశీ, రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం

మొదట కాశీ, రెండోది తిరుమల తిరుపతి దేవస్థానం


ఈ సంస్థ దేశ వ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. ఇందులో వారణాసి మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. తిరుమల రెండో స్థానంలో నిలిచిందని సంస్థ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. పర్యాటకుల గదుల బుకింగ్ తిరుపతి నగరంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగింది. వారణాస, షిర్డీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

తిరుమలలో 2 నుంచి వైకుంఠ ద్వారా దర్శనం

తిరుమలలో 2 నుంచి వైకుంఠ ద్వారా దర్శనం

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టైం స్లాట్ టోకెన్లు పొంది

తిరుమలకు రావాలని.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లనుట్ల ఆయన పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్ ద్వారా 300
రూపాయల ఎస్ఈడీ టోకెన్లు రెండు లక్షలు కేటాయించామన్నారు. జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేం ర్త య్యేంత
వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

English summary
Tirumala tirupati temple is the second most visited shrine in the country: 1st is kashi vishwanath temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X