Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతి ఎయిర్ పోర్ట్ ఇక ప్రైవేటుకు.. కేంద్రానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డింగ్ ప్రతిపాదనలు !!

దేశానికి ఉన్న ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల దిశగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు వచ్చే సంస్థలను ప్రైవేటుపరం చేసి తద్వారా ఆర్థిక ఒత్తిడుల నుంచి గట్టెక్కాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాల ప్రైవేటీకరణ పై దృష్టి సారించింది. అందులో భాగంగా దేశంలోని 13 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక ఈ జాబితాలో తిరుపతి విమానాశ్రయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

13 ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటీకరణ చెయ్యాటానికి రంగం సిద్ధం

13 ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటీకరణ చెయ్యాటానికి రంగం సిద్ధం

దేశంలో 13 విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో 13 విమానాశ్రయాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పంపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఏడు చిన్న, ఆరు పెద్ద విమానాశ్రయాలకు బిడ్డింగ్ నిర్వహించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తిరుపతి విమానాశ్రయం కూడా ఉంది.

బిడ్డింగ్ ప్రతిపాదనలు పంపిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా

బిడ్డింగ్ ప్రతిపాదనలు పంపిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా

బిడ్డింగ్ కు ప్రతిపాదించిన ఎయిర్ పోర్ట్ లలో వారణాసి - ఖుషినగర్, గయ, అమృత్ సర్ - కాంగ్రా ,భువనేశ్వర్ - తిరుపతి, రాయపూర్- ఔరంగాబాద్ , ఇండోర్ -జబల్పూర్, హుబ్లీ- తిరుచ్చి విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే లాభాలతో ఉన్న విమానాశ్రయాలను, తీవ్రమైన నష్టాలతో ఉన్న విమానాశ్రయాలను కలిపి జతగా ఒక్కో ప్రాజెక్టులా ప్రైవేటుకు అప్పగించాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. ఇలా బిడ్డింగ్ కు పెట్టడం వల్ల ప్రైవేటు సంస్థలు స్పందిస్తాయి అన్న భావన కేంద్ర వర్గాల లో ఉంది.

2020-21 సంవత్సరంలో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణ

2020-21 సంవత్సరంలో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణ

నేషనల్ మానిటైజేషన్ పాలసీ లో భాగంగా 2022-25 మధ్య దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసి 20,872 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణపై దృష్టిసారించిన కేంద్రం 2020-21 సంవత్సరంలో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించింది. లక్నో, అహ్మదాబాద్, మంగళూరు, గౌహతి, జైపూర్, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించింది. ఇక ఇప్పుడు అమృత్ సర్ , వారణాసి, భువనేశ్వర్ ఇండోర్, రాయపూర్ లతోపాటు చిన్న విమానాశ్రయాలను కూడా విక్రయానికి పెట్టింది.

2024లో తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరించాలని భావించినా ముందే బిడ్డింగ్ కు

2024లో తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరించాలని భావించినా ముందే బిడ్డింగ్ కు

2024లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపట్టి 860 కోట్ల రూపాయలను రాబట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా ఎనిమిది వందల కోట్లు,తిరుపతి ఎయిర్ పోర్ట్ ప్రైవేటీకరణ ద్వారా 260 కోట్లు, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ ప్రైవేటీకరణ ద్వారా 130 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా ముందుకు వెళుతుంది. 2024లో తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించినా కానీ 2024 కంటే ముందే తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడానికి బిడ్డింగ్ కి వెళుతుంది.

Recommended Video

    Hindu communities are going on a Temple Liberation Maha Padayatra to protect Hindu temples
    భవిష్యత్ బిడ్డింగ్ లలో విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు

    భవిష్యత్ బిడ్డింగ్ లలో విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు


    ఇక తర్వాత జరగబోయే బిడ్డింగ్ లలో విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రైవేటీకరణ బాట పట్టిన కేంద్రం కష్టాలలో ఉన్న బ్యాంకులను, పలు పరిశ్రమలను, ఎయిర్ పోర్ట్ లను ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో మొత్తం 137 విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కేంద్ర విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తూ విమానాశ్రయాల ప్రైవేటీకరణ కు రంగం సిద్ధం చేస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+