ఆ జిల్లాలో ప్రభుత్వాన్ని మించి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ? లేటెస్ట్ సర్వే..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్నీ వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్ధాయిలో సహకారం లభించడం లేదని ఇప్పటికే కూటమి పార్టీల అధినేతలు, సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని చంద్రబాబు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో ఎన్నికలకు ముందు కూటమి కచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసి చెప్పిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తాజాగా మరోసారి సర్వే చేపట్టారు. ఇందులో పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆయన సర్వే వివరాలు వెల్లడించారు. తాజాగా మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలతో సర్వే ఫలితాలు వెల్లడించారు. ఇందులో షాకింగ్ ఫలితాలు కనిపించాయి.

తిరుపతి జిల్లాకు సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రవీణ్ వెల్లడించారు. ఇందులో వెంకటగిరిలో మిశ్రమ స్పందన కనిపిస్తోందని ఆయన తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇందులో సర్వేపల్లి, శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పనితీరుపై మాత్రం సానుకూలత ఉందన్నారు. ఇదే పరిస్దితి కొనసాగితే 2029లో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూటమికి కష్టమేనని తేల్చేశారు.
తిరుపతి ఎంపీ సెగ్మెంట్లో..
— Praveen Pullata (@praveenpullata) May 22, 2025
వెంకటగిరి - మిశ్రమ స్పందన.
మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత. సర్వేపల్లి, శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పనితీరుపై సానుకూలం. 2029లో ఈ సెగ్మెంట్లో కూటమికి కష్టమే! సంవత్సర కాలంలోనే తిరుపతి, సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలపై తీవ్ర…
ఈ సంవత్సర కాలంలోనే తిరుపతి, సత్యవేడు, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు ప్రవీణ్ వెల్లడించారు. విచిత్రంగా ఎమ్మెల్యేల కంటే ప్రభుత్వంపై మాత్రం కొంత సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు. దీంతో ఎమ్మెల్యేలు పనీతీరు మెరుగుపర్చుకోవాలన్న చంద్రబాబు మాటలతో దీన్ని పోల్చిచూస్తే నిజమనే అనిపిస్తోంది. అయితే ప్రవీణ్ వెల్లడిస్తున్న సర్వే వివరాలను కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు తోసిపుచ్చుతున్నారు. ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications