Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం

అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు అనూహ్యంగా కలియుగ వైకుంఠం తిరుపతిని తాకాయి. యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం సామాన్యుడి వంటగదిని చేరకూడదనే ఉద్దేశంతో గ్యాస్ కంపెనీలు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఆధ్యాత్మిక రాజధానిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రేపటి నుండి తిరుపతి నగరంవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రకటించాయి.

తిరుపతి ఆర్థిక వ్యవస్థ అంతా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులపైనే ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్న టీ కొట్టు నుండి భారీ హోటళ్ల వరకు సుమారు 3,000కు పైగా తినుబండారాల కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ నెలకు సగటున 40 వేల కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో వేలాదిగా తరలివచ్చే భక్తులకు కనీసం అల్పాహారం, భోజనం అందించడం కూడా హోటల్ యజమానులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్ద స్టాక్ నిండుకోవడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Tirupati Gas Crisis Commercial Cylinder Supply Suspended Due to Fuel Crisis Amid Middle East War

కమర్షియల్ Gas కట్.. గృహ వినియోగానికే మొగ్గు

యుద్ధం వల్ల ముడి చమురు సరఫరాలో ఏర్పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ముందుగా గృహ వినియోగదారులకు (Domestic Users) గ్యాస్ కొరత రాకుండా చూడాలన్నదే కంపెనీల ప్రాధాన్యత. ఇందుకోసం కమర్షియల్ కోటాపై వేటు వేయక తప్పలేదని ప్రతినిధులు వివరిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల భక్తులకు ఆహార పదార్థాల ధరలు పెరగడమే కాకుండా, తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏజెన్సీల వద్ద ఆందోళన

ఈ వార్త తెలియగానే తిరుపతిలోని 15కు పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకుల రద్దీ పెరిగింది. రేపటి నుండి సరఫరా ఉండదన్న భయంతో తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను రీఫిల్ చేయించుకోవడానికి తెల్లవారుజాము నుండే క్యూ కడుతున్నారు. ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలు లేక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+