• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అజ్ఞానవాసి... ప్యాకేజీ తీసుకుని రంకెలు... ఏం ఊడపొడిచాడని భయపడాలి : పవన్‌పై పేర్ని నాని

|

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఇన్నాళ్లు పవన్ అజ్ఞాతవాసి అనే అనుకున్నామని... ఆయన అజ్ఞానవాసి అని కూడా తెలిసిందని ఎద్దేవా చేశారు. పవన్ ఓ అద్దె మైకులా తయారయ్యారని... ప్యాకేజీలు మాట్లాడుకుని బీజేపీ తరుపున మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తానని చెప్తున్న పవన్ కల్యాణ్... ప్రత్యేక హోదా,పోలవరం తదితర విషయాల్లో కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు.

ఏం ఊడపొడిచావని భయపడాలి : పేర్ని నాని

ఏం ఊడపొడిచావని భయపడాలి : పేర్ని నాని

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఈరోజుకు నిందితులను పట్టుకోలేకపోయారని పవన్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేసు దర్యాప్తులో పురోగతి తీసుకురావచ్చు కదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు తానంటే భయమని పవన్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఎద్దేవా చేశారు. అవును పవన్‌ను చూసి తాము భయపడిపోయి... ఒళ్లంతా తాయొత్తులు కట్టించుకుంటున్నామని చెప్పారు. ఏం ఊడపొడిచారని పవన్‌ను చూసి భయపడాలి... చంద్రబాబు నాయుడితో తిరిగి తిరిగి పవన్ కల్యాణ్ సొల్లు మాటలు ఎక్కువైపోయాయని విమర్శించారు.

అప్పుడెందుకు ప్రశ్నించలేదు : పేర్ని నాని

అప్పుడెందుకు ప్రశ్నించలేదు : పేర్ని నాని

వానాకాలంలో వానలు వచ్చినట్లు ఎన్నికలు వచ్చినప్పుడే పవన్ నాయుడు వస్తారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కాపులు,బలిజలకు కష్టమొచ్చినప్పుడు ఏనాడు మాట్లాడని వ్యక్తి... ఇప్పుడు కేవలం వారి ఓట్ల కోసమే కులాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమకారులపై అన్యాయంగా కేసులు పెడితే ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కేవలం ఓట్లు వచ్చినప్పుడే పవన్‌కు కులాలు గుర్తుకొస్తాయని విమర్శించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా...

అప్పుడలా.. ఇప్పుడిలా...

అప్పట్లో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని ఎద్దేవా చేసిన పవన్... ఇప్పుడా పాచిపోయిన లడ్డూలు ఇచ్చినవారికే ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఒకవేళ ఏపీ నుంచి చైనాకు ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగితే అందులో కేంద్రమంత్రులు అమిత్ షాకు,రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా వాటాలు ఉండాలి కదా అన్నారు. వారికి తెలియకుండా చైనాకు ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఏపీలో ఐటీ కార్యదర్శిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చాయని పవన్ చెప్తున్నారని... అదంతా వైఎస్ హయాంలోనే జరిగిందన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

ప్యాకేజీ తీసుకుని రంకెలు... : పేర్ని నాని

ప్యాకేజీ తీసుకుని రంకెలు... : పేర్ని నాని

కేవలం ప్యాకేజీ కోసం ఎవరో ఏదో చీటి రాసిస్తే దాన్ని చదువుతూ పెద్ద పెద్ద రంకెలు వేయడమెందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి తమ్ముడిగానే పవన్ కల్యాణ్‌ను ప్రజలు గుర్తించారని... ఆయన మీద అభిమానంతోనే అభిమానిస్తున్నారని చెప్పారు. తెర మీద నటించలేకపోయినా రాజకీయాల్లో మాత్రం ఆయన గొప్పగా నటిస్తున్నారని అన్నారు. మీలాంటి పోటుగాడు రాజకీయాల్లో ఎవరూ లేరని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేస్తుంటే పవన్ కల్యాణ్ కేంద్రాన్ని,మోదీని ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. బరితెగించి,నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.ప్రజలు సినిమా వరకే పవన్‌ను చూస్తారని... ఓటు మాత్రం వైసీపీకే వేస్తారని చెప్పారు.

English summary
Minister Perni Nani countered Janasena chief Pawan Kalyan. Nani alleged that Pawan is a package man and he will come into the people when there is elections only.He asked that why dont Pawan Kalyan questions centre govt for not giving funds for Polavaram and buying Vizag steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X