తిరుపతి తొక్కిసలాటపై సమీక్షకు కేంద్రం నిర్ణయం: ఆ తరువాత ఏమైందో ఏమో కానీ

Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తిరుపతి బైరాగిపట్టెడలో గల పద్మావతి పార్కు, రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న విష్ణునివాసం వద్ద ఈ నెల 8వ తేదీన చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Tirupati Stampede MHA withdraw the review orders

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి పూనుకుంది. వైపరీత్యాల నిర్వహణ విభాగం అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్‌ను తిరుపతికి పంపించాలని తొలుత నిర్ణయించుకుంది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ కూడా రాసింది.

అమిత్ షా ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందీ వైపరీత్యాల నిర్వహణ విభాగం. వైకుంఠ ద్వార దర్శనం టోకెనలను జారీ చేసే కౌంటర్ల వద్ద టీటీడీ అధికారులు ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లు ఎలాంటివి?, తిరుపతి, తిరుమలల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి విధానాలను అనుసరిస్తోన్నారు?, తొక్కిసలాట జరగడానికి దారి తీసిన సంఘటనలు ఏమిటనే విషయాలపై సంజీవ్ కుమార్ జిందాల్.. బీఆర్ నాయుడు, టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, ఏఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేష్‌తో సమావేశం కావాల్సి ఉంది.

ఈ నెల 19వ తేదీన సంజీవ్ కుమార్ జిందాల్ ఢిల్లీ నుంచి విమానంలో చెన్నై విమానాశ్రయానికి, అక్కడి నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వస్తారంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షెడ్యూల్ సైతం ఖరారు చేసింది. 20వ తేదీన టీటీడీ అధికారులతో సమీక్ష ఉంటుందంటూ ఈ లెటర్‌లో పేర్కొంది.

ఆ తరువాత ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. అనివార్య కారణాల వల్ల తొలుత రాసిన నంబర్ 40-01/2022-డీఎం-ఐ (ఏ) లెటర్‌ను ఉపసంహరించుకుంటోన్నట్లు తెలిపింది. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారికి లెటర్ పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+