ఏడుకొండల వాడికి రూ. 4కోట్ల ‘పెద్ద’ కష్టం: ఆర్బీఐ తీర్చేనా..?
తిరుమల ఏడుకొండల వాడికి పాత పెద్ద నోట్ల రూపంలో చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించని నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనం(పాత పెద్ద నోట
తిరుపతి: తిరుమల ఏడుకొండల వాడికి పాత పెద్ద నోట్ల రూపంలో చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించని నేపథ్యంలో నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనం(రద్దయిన పెద్ద నోట్లు)ను భారీ మొత్తంలో హుండీల్లో సమర్పించుకున్నారు.
ప్రభుత్వం విధించిన డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత ఈ రెండు నెలల్లో శ్రీవారికి రూ.4 కోట్ల విలువైన పాత 500, వెయ్యి నోట్లు రావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డెడ్‌లైన్ తర్వాత పాత నోట్లు పది కంటే ఎక్కువ ఉండకూడదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పాత నోట్లను ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది.

ఈ నోట్లను ఏం చేయాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి లేఖ రాసింది. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ టీటీడీ అధికారి వెల్లడించారు. డిసెంబర్ 30 డెడ్‌లైన్ తర్వాత దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు కొత్త నోట్లతోపాటు పాత నోట్లను కూడా హుండీల్లో వేస్తున్నారు.
ఇలా రూ.4 కోట్లకుపైగా పాత నోట్లు వచ్చినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఆర్బీఐ ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప.. తిరుమలకు ఈ పెద్ద కష్టం తీరేట్లు కనిపించడం లేదు.
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications