తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!
తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మరో నెలరోజుల్లో తిరుపతి నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ మధ్య విమాన సర్వీసులు ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం మలేషియా నుంచి వచ్చిన స్కైలెట్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. తామే సొంతంగా ఈ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణతో కలిసి వారు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం వారు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ సురేష్‌తో భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనలను వారు ఆయన ముందు ఉంచారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని సురేష్ వారికి వివరించారు. మలేషియాలో ఉన్న ప్రవాస భారతీయులు నేరుగా తిరుపతికి చేరుకోవడానికి ఈ విమాన సర్వీసులు ఉపయోగపడతాయని సురేష్ తెలిపారు.

ప్రస్తుతం మలేషియా నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి రావాలంటే ముందుగా చెన్నై లేదా తిరుచ్చిలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా తిరుమలకు వస్తున్నారు. మలేషియా-చెన్నై మధ్య ప్రస్తుతం రోజూ 10 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆయా విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో కనీసం 60 శాత మంది తిరుమలకు వచ్చే వారే. తిరుపతి- కౌలాలంపూర్ మధ్య ప్రయాణికుల తాకిడి ఆశించిన స్థాయిలో ఉండటం వల్ల ఈ రెండు నగరాల మధ్య విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకుని వస్తే.. లాభదాయకంగా ఉంటుందని స్కైలెట్ లాజిస్టిక్స్ ప్రతినిధులు తెలిపారు. దీనిపై త్వరలోనే నిర్ణయాన్ని తీసుకుంటామని సురేష్ వారికి హామీ ఇచ్చారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications