అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఐడీవి వికృత చేష్టలు-సోషల్ పోస్టుల కేసులపై చంద్రబాబు ఫైర్-ఇక నేనే స్టేషన్ కు వెళ్తా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనే కారణంతో టీడీపీ సానుభూతిపరుల్ని, కార్యకర్తల్ని సీఐడీ అరెస్టులు చేస్తుండటంపై విపక్ష నేత చంద్రబాబు ఇవాళ తీవ్రంగా స్పందించారు. సీఐడీ నిర్ణయాలపై ఆయన విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించి మరీ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

గుంటూరులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు సోషల్ మీడియా పోస్టుల కేసులో అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. 41-ఎ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి వెళ్లాలా అని సీఐడీ పోలీసుల్ని ప్రశ్నించారు.

Title tdp chief chandrababu slams cid actions against social media posts on jagan regime

సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయన్నారు. సుప్రీంకోర్టును సైతం లెక్కచేయని విధంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 మందిపై కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారుఆయా అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు.
అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు నేనే వెళ్తానని చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదన్నారు. ఇలాంటి పాలనలో బలిపశువులు కావద్దని పోలీసులను కోరుతున్నానన్నారు. పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా..సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు.

41-ఎ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి వెళ్లాలా..ఇంటిగోడలు దూకి వెళ్లాలా.. అని చంద్రబాబు సీఐడీని ప్రశ్నించారు.
లైట్లు పగలగొడతారా..ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. గోడలు దూకే పోలీసులు.. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోరా అని చంద్రబాబు ఆక్షేపించారు.

English summary
tdp chief chandrababu slams ysrcp govt for cid arrest on social media posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X