ఆగకుండా చూడండి, రాసిస్తాం: టిపై ప్రణబ్‌కు కోదండ

పార్టీ యేతర ఐఖాస స్టీరింగ్ కమిటీ సభ్యులం 38 మందిమి ఒక ప్రతినిధి బృందంగా వెళ్లి మెమోరాండం ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రకటించినందుకు బిల్లును అసెంబ్లీకి పంపి చర్చకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి, తీరా ప్రకటన వచ్చాక అవకాశవాద-అప్రజాస్వామిక చర్యలకు దిగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, ముసాయిదా బిల్లుపై చర్చకు కల్పించిన వెసులుబాటును వదులుకుంటున్నాయని, దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును కూడా గౌరవించటంలేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు ఏమైనా ప్రతిపాదించారా అన్న ప్రశ్నకు సవరణలను తర్వాత లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి సమర్పిస్తామని చెప్పారు. రాష్ట్రపతికి ఐకాస నాలుగు పేజీల మెమోరాండంను సమర్పించింది. అందులో పలు అంశాలు పొందుపర్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దన్నుతోనే సీమాంధ్ర నాయకులు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని వారు ఆరోపించారు.












Click it and Unblock the Notifications