యువకుడిపై దాడి కేసు: రిమాండ్‌కు సినీ నటుడు ఉదయ్ కిరణ్
హైదరాబాద్: తప్పతాగి బెదిరిచడంతో పాటు భౌతికంగా ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డ సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీని జూబ్లిహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎంవీఎస్ ఎస్ ప్రవీణ్ కుమార్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఎయిర్ పబ్ వద్దకు వచ్చాడు.
అదే సమయంలో మద్యం తాగి ఎయిర్ పబ్ నుంచి కిందకు దిగిన ఉదయ్ కిరణ్ ప్రవీణ్‌ను గమనించాడు. గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో ప్రవీణ్‌ను చూడగానే ఉదయ్‌కిరణ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరికించాడంటూ ప్రవీణ్‌పై దాడిచేశాడు.

గొడవ తీవ్రం కావడంతో పబ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఉదయ్ కిరణ్ తో పాటు ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసారు. ఉదయ్‌కిరణ్‌పై 506, 326 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సినీ నటుడు నండూరి ఉదయ్ కిరణ్ ‘పరారె' చిత్రంలో నటించారు. అందరూ అతన్ని బాబీ అని పిలుస్తుంటారు. గతంలో కూడా ఉదయ్ కిరణ్ పేరు డ్రగ్స్ కేసులో కూడా వినిపించింది. ఈ పబ్‌లో గొడవకు కారణం కూడా గతంలో జరిగిన సదరు డ్రగ్స్ కేసు వ్యవహారమేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications