స్టార్ వార్: 2019లో అనంతపురంలో పవన్ కళ్యాణ్ Xబాలయ్య, ఎవరిది పై చేయి?
2019 ఎన్నికల్లో తాను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేస్తానని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం నాడు ప్రకటించారు.
హిందూపురం: 2019 ఎన్నికల్లో తాను హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేస్తానని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం నాడు ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లా నుండే టాలీవుడ్ హీరోలు నందమూరి బాలకృష్ణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు పోటీచేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే జిల్లా నుండి పోటీచేయనున్నారు . దీంతో ఈ జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అయితే టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై పవన్ ఏ మేరకు ప్రభావం చూపుతారనే ఆసక్తి నెలకొంది.
మూడు రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కారణంగా కొంత కాలంగా ఆయన నియోజకవర్గ పర్యటనకు దూరంగా ఉన్నారు.
అదే సమయంలో నియోజకవర్గంలోని టిడిపి నాయకుల మధ్య చోటుచేసుకొన్న విబేధాలపై పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. దీంతో పిఎ ను కూడ మార్చారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ పోటీచేయనున్నట్టు ప్రకటించారు. అనంతపురం జిల్లా నుండే పోటీచేస్తానని జనసేన చీఫ్ ప్రకటించారు.అయితే ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ స్టార్ హీరోలు అనంతపురం జిల్లా నుండి పోటీచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హిందూపురం నుండే పోటీచేస్తా
వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుండే పోటీచేస్తానని సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. గుడివాడ, మైలవరం నుండి పోటీ చేస్తానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలు నిరాధారమన్నారు. హిందూపురం పట్టణానికి రూ.198 కోట్లతో హంద్రీనీవా నుండి పైపులైన్లు వేసి ఐదు నెలల్లోగా నీటిని అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. వచ్చే ఏడాది లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాల పట్ల తాను ఆవేదన చెందినట్టు వస్తున్న వార్తలు సత్యదూరమన్నారు బాలయ్య.

అనంతపురం నుండే పవన్ కళ్యాణ్ పోటీ
2019 ఎన్నికల్లో పోటీచేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు.ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ అనంతపురం నియోజకవర్గం నుండే పోటీచేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. అయితే ఆయన ఏ నియోజకవర్గం నుండి పోటీచేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు అనంతపురం జిల్లాను పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంపికచేసుకొన్నాడనే విషయమై కూడ రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే జిల్లానుండి పోటీచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయాల్లో ఆసక్తిని కల్గిస్తోంది. అయితే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఏ మేరకు ఈ జిల్లాలో తన ప్రభావాన్ని చూపుతారని కూడ విశ్లేషకులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

స్టార్ హీరోల మధ్య వార్
అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట. మాజీ మంత్రి పరిటాల రవి బతికున్న సమయంలో ఈ జిల్లా రాజకీయాలను ఆయన శాసించేవాడు.అయితే ఆయన మరణం తరవాత కూడ ఈ జిల్లా నుండి టిడిపి ప్రజా ప్రతినిధులు అదే సంఖ్యలో గెలుపొందుతూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల సమయంలోనే హిందూపురం నుండి బాలకృష్ణ పోటీచేసి విజయం సాధించాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న జెసి దివాకర్ రెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. దీంతో టిడిపికి రాజకీయంగా కలిసివచ్చిందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ జిల్లా నుండే బాలకృష్ణ టిడిపి నుండి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పోటీచేయనున్నారు. టిడిపికి పెట్టని కోటగా ఉన్న ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు ప్రభావం చూపుతోందనే విషయమై ఆసక్తి నెలకొంది. అయితే రాజకీయాల్లో రాణించాలంటే అంతా ఆషామాషీ విషయం కాదు. ప్రజల మననుసు గెలుచుకోవాలి. అప్పుడే ప్రజలు వారిని ఆదరిస్తారు. లేకపోతే వారికి ఇబ్బందులు తప్పవు. ఎన్టీఆర్ లాంటి నటుడినే కల్వకుర్తి నియోజకవర్గంలో ఓడించిన చరిత్ర ఉందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

ప్రజల మనసును గెలవాలి
ఏ రాజకీయపార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల మనసును గెలవాలి. సినిమాల్లో నటిస్తున్న నటులు రాజకీయాల్లో రాణించాలంటే వారి పార్టీలు అనుసరించే విధానాలు, వాటి ఆచరణ ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు యువతలో మంచి ఆదరణ ఉంది.అయితే ఆయనను సినిమాల్లో అభిమానించేవారంతా ఎన్నికల్లో ఆయన పోటీచేస్తే ఆయనకే ఓటు చేస్తారా అనే విషయమై స్పష్టత ఇవ్వలేం. అయితే అభిమానులంతా ఓటర్లు కాకపోయి ఉండొచ్చు. ఒక వేళ ఓటర్లుగా ఉన్న వారి ఓట్లను మలుచుకోవడం కూడ అతి ప్రధానమే. అనంతపురం జిల్లాలో నందమూరి కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించారు. హరికృష్ణ కూడ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలో స్టార్ వార్ కొనసాగే అవకాశం కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications