RRR: జగన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం: కన్నడ గడ్డపై: ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు: మెగాపైనా

అమరావతి: పాన్ ఇండియా మూవీ.. ట్రిపుల్ ఆర్ ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 25వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంకా అయిదు రోజులు ఉండగానే.. ఈ మూవీ మేనియా కమ్మేస్తోంది. అభిమానులను ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మల్టీ స్టారర్ సినిమా ఇది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా..

సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా..

సంక్రాంతి పండగకే ఇది విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందడం, ఏపీలో సినిమా టికెట్ల వివాదం వంటి కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం ఈ రెండు సమస్యలు లేవు. వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా టికెట్ల వివాదానికీ ఏపీ ప్రభుత్వం తెర దించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దల కోరిక మేరకు సినిమా టికెట్ల రేట్లను సవరించింది. ఇదివరకటి కంటే రేట్లను పెంచింది. కొద్దిరోజుల కిందటే ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. జీవో వెలువడింది.

రాజమౌళి మళ్లీ భేటీ..

రాజమౌళి మళ్లీ భేటీ..

కొత్త జీవో వెలువడిన తరువాత కూడా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి వైఎస్ జగన్‌తో మరోసారి భేటీ అయ్యారు. తన వెంట నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇందులో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ను ఆయన కలుసుకోవడం రెండోసారి. అంతకుముందు సినిమా టికెట్ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ముఖ్యమంత్రిని కలిసిన టాలీవుడ్ ప్రతినిధుల బృందంలో రాజమౌళి ఉన్నారు.

సినిమా బడ్జెట్ గురించి..

సినిమా బడ్జెట్ గురించి..

ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరించడానికి అయిన ఖర్చును రాజమౌళి.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 336 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించినట్లు చెప్పారు. నటీనటుల రెమ్యునరేషన్‌తో కలిపి అది 478 కోట్ల రూపాయలకు పెరిగిందని వివరించారు. ఇదివరకు జారీ చేసిన టికెట్ల ధరల వల్ల నిర్మాణ వ్యయం వెనక్కి వచ్చే పరిస్థితులు లేకపోవచ్చని, అందుకే- ప్రత్యేకంగా రేట్లను ఇంకొంత పెంచాలని విజ్ఞప్తి చేశారు.

 జగన్‌కు ప్రశంసలు..

జగన్‌కు ప్రశంసలు..

దీనికి సానుకూలంగా స్పందించారు వైఎస్ జగన్. ఇప్పుడున్న టికెట్లప అదనంగా మరో 75 రూపాయలను వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీని పట్ల రాజమౌళి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వేదికపై నుంచి వైఎస్ జగన్‌ను థ్యాంక్స్ చెప్పారు. అదనంగా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి సహకరించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలకు ధన్యవాదాలు తెలిపారు.

 అర్థం చేసుకున్నారు..

అర్థం చేసుకున్నారు..

సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన బడ్జెట్ గురించి వైఎస్ జగన్‌కు వివరించినప్పుడు ఆయన అర్థం చేసుకున్నారని, సానుకూలంగా స్పందించారని రాజమౌళి అన్నారు. అటు రేట్లు మరీ పెంచి, ప్రేక్షకుడిపై భారం పడకుండా, పేదవాడికి సినిమా దూరం కాకుండా బ్యాలెన్స్డ్‌గా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తమకు సహకరించారని, వారికి థ్యాంక్స్ చెబుతున్నానని పేర్కొన్నారు.

నెగ్గించడానికి తగ్గిన చిరంజీవి..

నెగ్గించడానికి తగ్గిన చిరంజీవి..

మెగాస్టార్ పవన్ కల్యాణ్‌ను ఎస్ఎస్ రాజమౌళి ఆకాశానికెత్తేశారు. సినిమా టికెట్ల రేట్లను పెంచే విషయంలో చిరంజీవి చేసిన కృషిని విస్మరించలేమని అన్నారు. చిత్ర పరిశ్రమలను నెగ్గించడానికి చిరంజీవి తగ్గారని చెప్పారు. టికెట్ల రేట్లను పెంచేలా ప్రభుత్వాన్ని సంప్రదించే విషయంలో తామెవరం ముందడుగు వేయలేకపోయామని, ఆ సమయంలో చిరంజీవి చొరవ తీసుకున్నారని, వైఎస్ జగన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+