మీ తిట్లతో అసహ్యం, రాష్ట్రం కోసం ఏడాదైనా పనిచేయండి: తమ్మారెడ్డి భరధ్వాజ
అమరావతి: ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీ నేతల మధ్య తిట్ల యుద్దం చూస్తోంటే అసహ్యాం వేస్తోందని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ చెప్పారు. ఈ రెండు పార్టీలు రాజీనామాలు చేసి వెళ్ళిపోతే రాష్ట్రాన్ని తాము చూసుకొంటామని ఆయన చెప్పారు. ఒక్క ఏడాదైనా కలిసి పనిచేయండి రాష్ట్రాన్ని బాగు చేయండని ఆయన సూచించారు.
తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ చెప్పారు. టీడీపీని వైసీపీ నేతలు, వైసీపీని టీడీపీ నేతలు తిట్టుకొంటున్నారని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీల నేతలకు చిత్తశుద్ది ఉంటే ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి రాష్ట్రం కోసం పనిచేసేవారని ఆయన చెప్పారు.

మీ రెండు పార్టీలు తిట్టుకొంటుంటే వినడానికి తాము లేమని ఆయన చెప్పారు. మంచి జరుగుతోందనే ఉద్దేశ్యంతోనే ఓట్లు వేసినట్టుగా ఆయన చెప్పారు. కానీ రెండు పార్టీల తీరుపై తమ్మారెడ్డి భరధ్వాజ నిప్పులు చెరిగారు.
ఒకరిపై మరోకిరు చేసుకొనే విమర్శలు వింటూంటే అసహ్యాం వేస్తోందన్నారు. మంచి చేస్తారనే ఉద్దేశ్యంతో ఓట్లు వేస్తే ప్రజలకు ఏం చేయకుండా ఒకరినొకరు తిట్టుకొంటూ కూర్చొంటున్నారని తమ్మారెడ్డి దుయ్యబట్టారు.
నాలుగేళ్లపాటు ఒకరినొకరు తిట్టుకొంటూనే కాలం గడిపారని చెప్పారు. కనీసం ఏడాదిపాటైనా కలిసి రాష్ట్రం కోసం పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి ఒక పార్టీపై మరో పార్టీ అసహ్యాంగా విమర్శలు చేసుకోవడంపై తమ్మారెడ్డి మండిపడ్డారు.రాష్ట్రం కోసం ఇప్పటికైనా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications