అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభాస్ - మహేష్ హ్యాపీ : సీఎం జగన్ నిర్ణయంతో : మరోసారి మెగాస్టార్ భేటీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా సాగిన కోల్డ్ వార్ సమిసిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల పైన హర్షం వ్యక్తం చేస్తోంది. చిరంజీవితో పాటుగా సీనీ హీరోలు.. దర్శకులు సీఎంను కలిసి సినిమా టిక్కెట్ల ధరల పెంపు పైన చర్చలు జరిపారు. అదే సమయంలో సినిమా పరిశ్రమ సమస్యల పైనా చర్చించారు. వారి ప్రతిపాదనల పైన సానుకూలంగా స్పందించిన సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ధరలు పెంచుతూ జీవో జారీ చేసారు. ఇక, ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20,గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారించింది.

టిక్కెట్ల ధరల పెంపుతో

నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేసింది. ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం,నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ జరిగింది. అంటే.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. జీవో జారీ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు. ఇక, ఇదే అంశం పైన తాను విడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తాను ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుందని..తానే వివరించగా చెబుతానంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించారు.

నిన్న ప్రభాస్.. నేడు మహేష్

నిన్న ప్రభాస్.. నేడు మహేష్


ఇక.. తన సినిమాకు ముందే టిక్కెట్ ధరల పెంపుతో డార్లింగ్ ప్రభాస్ హ్యాపీగా కనిపిస్తున్నారు. సీఎం జగన్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు. తాజాగా.. మహేష్ ట్వీట్ చేశారు. మున్ముందు ఏపీ ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య మ‌రింత మెరుగైన సంబంధాలు నెల‌కొనేలా ముందుకు సాగుతామ‌ని మహేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే జగన్ తోపాటు ఏపీ మంత్రి పేర్ని నానికి కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం జగన్ కు థాంక్స్ చెప్పారు. ఏపీ ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. త్వరలోనే సీఎం ను కలిసి ధన్యవాదాలు చెబుతామని వెల్లడించారు.

మరోసారి మెగాస్టార్ భేటీ

మరోసారి మెగాస్టార్ భేటీ

చిరంజీవి ప్రయత్నాల వలనే .. ఆయన చేసిన చర్చల కారణంగానే సమస్య పరిష్కారం అయిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా సీఎంతో సమావేశం అయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమతో చేసిన చర్చలకు అనుగుణంగా జీవో జారీ చేయటం పైన వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు చెప్పాలని భావిస్తున్నారు. ఆ సమయంలోనే సినీ ప్రముఖులను తీసుకొని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, కొందరు పెద్దలు ఈ జీవో భీమ్లానాయక్ ముందే విడుదల చేసి ఉంటే వివాదం ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Radhe Shyam, RRR కొత్త హైక్స్ AP Ticket Prices GO| Bheemla Nayak ని ముంచేసారు | Oneindia Telugu
సమస్య సమిసిపోయిందంటూ

సమస్య సమిసిపోయిందంటూ


అయినా... ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల విడుదలకు ముందే ఈ జీవో జారీ చేయటం పైన ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదలు చెబుతోంది. ఇక.. ఏపీలో షూటింగ్ విషయంలోనూ కొందరు నిర్మాతలు సై అంటున్నారు. 20 శాతం షూటింగ్ ఏపీలో చేయాలనే నిబందనకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. అదే విధంగా.. కొన్ని చిన్న చిన్న అంశాలను ప్రభుత్వం జీవోలో ప్రస్తావించలేదని..వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు స్పష్టం చేసారు.

English summary
Hero's Prabhas and Mahesh babu thanks to CM Jagan on decision to hike cinema ticket rates in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X