నరేష్ ఆస్తి.. రూ.వెయ్యి కోట్ల పైనే!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా విజయవంతమైన నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరుచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. మొదటి నుంచి నటుడిగా బిజీగా ఉండే నరేష్.. తన తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులను కలిపితే రూ.వెయ్యి కోట్లపైనే ఉంటుంది. ఈ విషయాన్ని మీడియాతోకానీ, ఇంటర్వ్యూల్లోకానీ ఏనాడూ చెప్పలేదు.
లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం 'మళ్ళీ పెళ్ళి'ని నరేష్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఆస్తులు, ఆర్థిక స్థితిగతులపై ఓపెన్ గా మాట్లాడారు. తనకు వెయ్యికోట్ల రూపాయలకంటే ఎక్కువ ఆస్తులు ఉండొచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. అవన్నీ ఊహాగానాలు కాదని, నిజమే అని స్పష్టతనిచ్చారు.

తాను చాలా రిచ్ అనడంలో ఎటువంటి సందేహం అవసరంలేదని, బిలియనీర్ ని ఒప్పుకుంటున్నానన్నారు. తన తల్లి విజయ నిర్మల నుంచి ఆస్తులు వచ్చాయని, అలాగే తాను కూడా కష్టపడి సంపాదించానన్నారు. సంపాదించిన డబ్బులను భూములమీద పెట్టామని, ఇప్పుడు వాటి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ధరలు పెరగడంవల్ల అప్రిసియేషన్ వచ్చిందని, అయితే ఎంత డబ్బు ఉంది అన్న విషయంపై ఆధారపడి ధనవంతులుగా నిర్ణయించరన్నారు.

మనం ఎంత సంతోషంగా జీవిస్తున్నామన్నదే ముఖ్యమని, ప్రతిరోజు ఎంతో ఆనందంగా గడుపుతున్నామనిపించాలన్నారు. డబ్బును ఎలా ఖర్చుచేస్తామనేది కూడా చూడాలని, అవసరంలో ఉన్నవారికోసం కూడా డబ్బులు ఖర్చుపెడతామన్నారు. వీలైనంతవరకు పదిమందికి సాయం చేయడానికే ప్రయత్నిస్తున్నానన్నారు. తాను సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని, అన్నిటికంటే అది చాలా ముఖ్యమైన విషయమన్నారు.












Click it and Unblock the Notifications