ఏపీలో 50రూపాయలకే టమాటాలు; ధరల కట్టడికి జగన్ సర్కార్ చేస్తుందిదే!!
విపరీతంగా పెరుగుతున్న కూరగాయల ధరలు, టమాటా ధరలను నియంత్రించడం కోసం జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. సెంచరీ ని దాటి టమాట ధరలు పెరిగిపోయిన క్రమంలో ధరలను కిందికి దించేందుకు ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఈ మేరకు వినియోగదారులకు ఊరట కల్పించడానికి ప్రయత్నం చేస్తోంది.
రైతు బజార్లలో సబ్సిడీ ద్వారా టమాటాల విక్రయాలకు శ్రీకారం చుట్టింది. మార్కెట్లో టమాట ధర వంద రూపాయలకు పైగా విక్రయం అవుతుంటే ఏపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి టమాటాలను సేకరించి కిలో యాభై రూపాయల చొప్పున విక్రయిస్తోంది.

మొదట కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటాల విక్రయాలను ప్రారంభించగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లోని రైతుబజార్లలో సబ్సిడీ టమాటాల విక్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.సామాన్య జనం పైన భారం పడకుండా, ప్రభుత్వానికి భారమే అవుతున్నప్పటికీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో రైతుల నుండి 98 రూపాయల 104 రూపాయల వరకు చెల్లించి టమాటాలను కొనుగోలు చేస్తుంది జగన్ సర్కార్.
వాటిని రైతు బజార్ ల ద్వారా సబ్సిడీపై విక్రయిస్తుంది. టమాటాల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారుల పైన కూడా దృష్టి సారిస్తున్న ఏపీ సర్కార్ వారి పైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ రెడీ అయింది. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపనుంది.
టమాటాలను రైతుల నుండి సేకరించి తక్కువ ధరకు రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు టమాటాలతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా చుక్కలను తాకుతూ పెరుగుతున్న క్రమంలో ధరలను నియంత్రించడం కోసం సీఎం యాప్ ద్వారా నిత్యం సమీక్ష జరుపుతున్నారు. ఇక ధరల నియంత్రణకు చేపట్టవలసిన చర్యలపైన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications