Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాకినాడలో సీన్ రివర్స్ - పిఠాపురం పైనే ఆశలు..!!

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. గోదావరి జిల్లాల్లొ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. గోదావరి జిల్లాల్లో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికి అధికారం ఖాయం. ప్రధానంగా గోదావరిలో పవన్ ప్రభావం పైనే కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానంలో వైసీపీ, జనసేన తల పడుతున్నాయి. ఇదే పార్లమెంట్ పరిధిలో పవన పోటీ చేస్తున్నపిఠాపురం నియోజకవర్గం ఉండటంతో ఈ స్థానం పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.

గెలుపు దక్కేదెవరికి
కాకినాడ ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్దిగా చెలమలశెట్టి సునీల్, జనసేన అభ్యర్దిగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అటు పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పవన్‌ అడుగులు వేస్తున్నారు. ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ, టాలీవుడ్‌ సెలబ్రిటీల సైతం కొద్ది రోజులుగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ హోరా హోరీగానే సాగతోంది.మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిథ్యం వహిస్తున్న తునిలో కూటమి, అధికార పార్టీల మధ్య రసవత్తర పోరు చోటుచేసుకుంది.

Tough Fight Expected in Kakinada Loksbaha Pithapuram majority becomes crucial

యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసిపి కండువా కప్పుకున్నారు. కృష్ణుడు రాకతో వైసిపికి బలం చేకూరగా, టిడిపికి గట్టి దెబ్బ తగిలింది. కాకినాడ రూరల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఇక్కడ బరిలో ఉన్న జనసేన అభ్యర్థి పంతం నానాజీ గట్టి పోటీ ఇస్తున్నారు.

మారుతున్నలెక్కలు
కాకినాడ సిటీలో మరోసారి పాగా వేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి కొండబాబు బలంగానే ఢీ కొడుతున్నట్లు కనిపిస్తోంది. జగ్గంపేటలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు అసమ్మతి పోరు తప్పలేదు. జనసేన నేత సూర్యచంద్ర ఇక్కడ రెబల్‌ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో విజయం కోసం కూటమి కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది.

వైసిపి నుంచి ఇక్కడ తోట నరసింహం పోటీలో ఉన్నారు. పెద్దాపురంలో మూడోసారి చినరాజప్ప విజయం సాధించాలనే తపనతో పనిచేస్తున్నారు. అయితే అతనికి సొంత పార్టీలోనే అసమ్మతి నెలకొంది. ఇటు వైసిపి అభ్యర్థి దవులూరి దొరబాబుపై ఉన్న వ్యతిరేకత ఏ పరిస్థితులకు దారితీస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రత్తిపాడులో టిడిపి అభ్యర్థి వరుపుల సత్యప్రభకు సానుభూతి ఉండడంతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.

Tough Fight Expected in Kakinada Loksbaha Pithapuram majority becomes crucial

కాంగ్రెస్ తో ఎవరికి నష్టం
ఇక, కాకినాడ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ నంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు పోటీచేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అన్నిచోట్లా ఆయనకు పరిచయాలు ఎక్కువ. బంధుగణం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తనకున్న బలాలుగా పల్లంరాజు భావిస్తున్నారు. చలమలశెట్టి సునీల్‌ కాకినాడ ఎంపి అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు.

ఆయన గతంలో మూడుసార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. వైసిపి నుంచి మరోసారి బరిలో ఉన్నారు. జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థి శ్రీనివాస్ కు కూటమిలో కొంతమంది అభ్యర్థులు సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో పపన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మెజార్టీపైనే జనసేన ఆశలు పెట్టుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+