లోకేష్ తో లవ్, కుమార్ తో ప్రేమ .. 17ఏళ్ళ బాలిక చేసిన పనికి షాక్!
ప్రస్తుత సమాజంలో యువత పెడదారిన పడుతోంది. యువత ఆలోచన ధోరణిలో పూర్తిగా మార్పు వచ్చింది. పట్టుమని 18 సంవత్సరాలు కూడా నిండకుండానే వింత ధోరణులకు పాల్పడుతున్న యువత ప్రధానంగా సమాజంలో కనిపిస్తుంది. అనాలోచిత నిర్ణయాలతో, అర్థం పర్థం లేని భావోద్వేగాలతో ప్రేమంటే ఏమిటో తెలియని వయసులో ప్రేమ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు యువత జీవితాలను నాశనం చేస్తుంటే తల్లిదండ్రులకు శోకం మిగులుతోంది.
ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన బాలిక
తాజాగా అటువంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో కోటరవుట్లలో చోటు చేసుకుంది. 17 సంవత్సరాల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న బాలిక తల్లిదండ్రులు ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఆ బాలిక మరణానికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

బాలిక సూసైడ్ లెటర్ లో షాకింగ్ విషయాలు
మరణానికి ముందు బాలిక రాసిన సూసైడ్ లెటర్ లో కుమార్ ని ప్రేమించాను.. లోకేష్ ను లవ్ చేశాను. లోకేష్ లేకుంటే బ్రతకలేక పోతున్నాను. ఇదే సమయంలో కుమార్ ని కూడా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ వ్యవహారంతో మీకు చెడ్డ పేరు రావద్దు అన్న ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ లేఖ రాసి పెట్టి సూసైడ్ చేసుకుంది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు
అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెను కుమార్ అనే యువకుడు వేధిస్తున్నాడని, ఇటీవల అతను తమ కూతురితో గొడవ పడినట్లు తెలిసిందని, వేధింపులు తట్టుకోలేకనే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇద్దరితో బాలిక ప్రేమాయణం బయటకు వచ్చింది.
ప్రేమకు అర్ధం తెలీని వయసులో ఇద్దరిని ప్రేమించిన బాలిక
ప్రేమ అంటే అర్థం కూడా తెలియని వయసులో ఇద్దరిని ప్రేమిస్తున్నానంటూ బాలిక లెటర్ రాసి సూసైడ్ చేసుకోవడం ప్రస్తుత సమాజంలో యువత తీరును అందరూ ఆలోచించేలా చేస్తుంది. చాలా ఆందోళనకరమైన మానసిక స్థితిలో పిల్లలు ఉన్నారు అన్న భావనకు ఈ ఘటన కారణంగా మారింది. కనీసం మేజర్ కూడా కాకుండానే ఇద్దరిని ప్రేమించాను అని బాలిక సూసైడ్ చేసుకోవడం మన సమాజం ఎటు పోతుంది అన్న విషయాన్ని నొక్కి చెబుతోంది.












Click it and Unblock the Notifications