నందమూరి కుటుంబంలో విషాదం: ఎన్టీఆర్ కోడలు పద్మజ కన్నుమూత
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ప్రాణాలు విడిచారు. పద్మజ మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.నందమూరి పద్మజ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి. అంతేకాకుండా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి కూడా.
నందమూరి పద్మజ వయస్సు 73 సంవత్సరాలు కాగా.. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఎదురుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ విషాద వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. నందమూరి పద్మజ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications