ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వస్తోన్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
తాజాగా- ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. లారీనీ ఢీ కొట్టింది. రోడ్డుపై ఆగివున్న ఈ బస్సును మరో లారీ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి బయలుదేరిన ప్రైవేట్ బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయిపల్లి మిట్ట వద్ద వేకువ జామున 1:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మైత్రీ ట్రావెల్స్ కు చెందిన బస్సు అది. మొదట బస్సు డ్రైవరు ముందు వెళ్తోన్న లారీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆగిపోయిన బస్సును వెనుకల వస్తోన్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు మొత్తం నుజ్జునుజ్జు అయింది.
బస్సు వెనక సీట్లల్లో కూర్చొన్న ఇద్దరు మృతి చెందినట్లు చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుపోయాడు. అతి కష్టం మీద అతన్ని బయటికి తెచ్చారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications