విశాఖ వైపు 17 రైళ్ల దారి మళ్లింపు-ఇచ్చాపురం-సోంపేట మధ్య ట్రాక్ పై నీరు..!
అర్నబ్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం డివిజన్ లోని ఇచ్చాపురం-సోంపేట మార్గంలో ట్రాక్ పైకి భారీగా నీరు చేరడంతో అటువైపుగా వెళ్లాల్సిన 17 రైళ్లను దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఆయా రైళ్లలో ప్రయాణించే వారు కొత్త మార్గాలను పరిశీలించి, ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. ట్రాక్ లపై నీరు తొలగించిన తర్వాత ఈ రూట్లలో రెగ్యులర్ ప్రయాణాలకు రైళ్లను అనుమతిస్తారు. దారి మళ్లించిన రైళ్ల (train) వివరాలు ఇలా ఉన్నాయి.
రైలు నంబర్ 20610 తిరుచిరాపల్లి-న్యూజల్పాయ్ గురి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ వైపు మళ్లించారు. అలాగే రైలు నంబర్ 22864 బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలో మళ్లించారు. రైలు నంబర్ 12704 సికింద్రాబాద్ - హౌరా ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, సంబల్పూర్, అంగుల్, కటక్ మార్గంలో మళ్లించారు. అలాగే రైలు నంబర్ 16523బెంగళూరు-బాలుర్ఘాట్ ఎక్స్ ప్రెస్ రైలును విజయనగరం, తిట్లాగఢ్, సంబల్పూర్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలో మళ్లించారు. రైలు నంబర్ 17480 తిరుపతి- పూరీ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, సంబల్పూర్, నరాజ్ మార్తాపూర్, ఖుర్దా రోడ్ మార్గంలో మళ్లించారు.

రైలు నంబర్ 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, సంబల్పూర్, భువనేశ్వర్ న్యూ మార్గంలో మళ్లించారు.
రైలు నంబర్ 12864 బెంగళూరు -హౌరా ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలో, రైలు నంబర్ 22606 తిరునెల్వేలి-పురూలియా ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలోనూ, రైలు నంబర్ 12840 చెన్నై సెంట్రల్ -హౌరా ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలోనూ, రైలు నంబర్ 12868 పుదుచ్చేరి -షాలిమార్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలోనూ, రైలు నంబర్ 22826 చెన్నై సెంట్రల్ -షాలిమార్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలోనూ మళ్లించారు.
అలాగే రైలు నంబర్ 15673 ఇచ్ఛాపురం → కామాఖ్య రైలును విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్ మార్గంలోనూ,
రైలు నంబర్ 22611 చెన్నై సెంట్రల్ -న్యూ జల్పాయిగురి ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్
మార్గంలోనూ, రైలు నంబర్ 22503 కన్యాకుమారి -దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, ఝార్సుగూడా, ఖరగ్పూర్
మార్గంలోనూ 18046 ఇచ్ఛాపురం→ షాలిమార్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, కటక్, భువనేశ్వర్ మార్గంలోనూ, రైలు నంబర్ 20852 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ను విజయనగరం, తిట్లాగఢ్, కటక్, భువనేశ్వర్ మార్గంలోనూ, రైలు నంబర్ 22849 షాలిమార్ -సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ ను ఇచ్ఛాపురం, ఖుర్దా రోడ్, అంగుల్,తిట్లాగఢ్, విజయనగరం, విశాఖపట్నం మార్గంలోనూ మళ్లించారు.














Click it and Unblock the Notifications
