ఏపీలో ఈ రైళ్లన్నీ రద్దు!
ఏపీలోని రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లకు వెళ్లే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. పార్వతీపురం-గుమడ స్టేషన్‌ల మధ్య ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే కోరింది.
రద్దయిన రైళ్ల వివరాలు
విశాఖ-రాయ్‌పూర్ (08528),
రాయ్‌పూర్-విశాఖ (08527),
విశాఖ-కొరాపుట్ (08546),
విశాఖ-భవానీపట్నం (08504) రైళ్లను ఈ నెల 29 నుంచి మార్చి 5 వరకు రద్దు చేశారు.

కొరాపుట్-విశాఖ (08545),
భవానీపట్నం-విశాఖ (08503) రైళ్లను ఈరోజు నుంచి మార్చి 6 వరకు రద్దు చేశారు.
విశాఖ-కొరాపుట్ (18512) రైలును మార్చి 1 నుంచి 4 వరకు,
కొరాపుట్ -విశాఖ ( 18511) రైలును మార్చి 2 నుంచి 5 వరకు రద్దు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
బ్రహ్మపుర-నౌపడ మార్గంలో లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈరోజు ట్రాఫిక్ బ్లాక్ చేశారు. భువనేశ్వర్-చెన్నై సెంట్రల్(12830) ఎక్స్‌ప్రెస్ 5.25 గంటలు ఆలస్యంగా బయలు దేరుతుంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్(12703), విశాఖ-డిఘా(22874),విశాఖ-బ్రహ్మపుర(18526), భువనేశ్వర్-సి.ఎస్.టి. ముంబై (11020) రైళ్లు కూడా గంటకు పైబడి ఆలస్యంగా బయలుదేరతాయి.
కామాఖ్య-బెంగళూరు(12552), సి.ఎస్.టి. ముంబై-భువనేశ్వర్(11019), విశాఖ-భువనేశ్వర్(22802) ఇంటర్ సిటీ రైళ్లను కొన్ని స్టేషన్లలో 20 నిముషాల నుంచి 30 నిముషాలసేపు అదనంగా నిలిపివేయనున్నారు.












Click it and Unblock the Notifications