Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంగళగిరి ఎయిమ్స్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్‌కు అపర సంజీవనిగా కేంద్రం ఇచ్చిన వరాలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘనమైన చరిత్ర, ఆవిష్కరణలకు ఆలవాలమైన రాష్ట్రం. భారతదేశం అభివృద్ధి పథం వైపు నడవటంలో ఆంధ్రప్రదేశ్‌ది ప్రముఖపాత్ర . ఈ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా'గా ప్రసిద్ధి చెందింది. ఏపీ వ్యవసాయంలో విజయాలను మించి, ప్రీమియర్ డిజిటల్ టెక్నాలజీ రంగానికి నిలయంగా చెప్పవచ్చు. డిజిటల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు, పురోగతికి దారివేస్తోంది. తన ఆరోగ్యసంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాష్ట్రపౌరుల శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీ ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం భారత ప్రభుత్వ కీలక కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను రూపొందించడానికి భారత ప్రభుత్వం కీలక కార్యక్రమాలను చేపట్టింది. ఈ చర్యల వల్ల వెనుకబడిన తరగతులకు, పేదవారికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సంకల్పంలో భాగంగానే, ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధానంగా నాలుగు అంశాలతో రూపుదిద్దుకుంది.

నాలుగు అంశాలతో ఆయుష్మాన్ భారత్.. లక్ష్యం ఇదే

1.ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ద్వారా ఉచిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ
2.PMJAY పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల రిస్క్ కవర్‌తో ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ కోసం బీమా
3.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) లో భాగంగా రోగి ఆరోగ్యం కోసం స్వచ్ఛంద ఆరోగ్య ID రికార్డులు
4. ప్రజా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన..

AIIMS Mangalagiri

ఆయుష్మాన్ భారత్ యోజనతో ప్రతీ ఒక్కరికీ చేరువలో మెరుగైన వైద్యం

ఆరోగ్య రంగంలోని అన్ని విభాగాల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ఆయుష్మాన్ భారత్ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 10 కోట్ల మందికి పైగా బలహీన కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని, నిధుల కొరత, పేదరికం కారణంగా ఏ ఒక్కరూ వైద్య చికిత్సకి దూరం కాకూడదు అనేదే ప్రధాన ఉద్దేశం.ఈ యోజన కింద ఎంతోమంది పేదపిల్లలకు, గ్రామీణులకు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను రక్షించడం సాధ్యపడింది.

ఏపీ అంతటా కేంద్ర సహకారంతో జన్ ఔషధీ కేంద్రాలు

ఆరోగ్య కవరేజీ పథకంతో పాటు, జన్ ఔషధీ కేంద్రాలు నాణ్యమైన జనరిక్ మందులను అందజేస్తాయి. ఇవి సామాన్యుల మెడిసిన్ ఖర్చులను 70%వరకు తగ్గిస్తాయి. కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పడకుండా చూస్తున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఇలాంటి చొరవ వల్ల ఏపీలో తక్కువ ధరలకే అవసరమైన మందులు లభిస్తున్నాయి. 2022నాటికి, భారతదేశంలో మొత్తం 8900పైగా జన్ ఔషధీ కేంద్రాలున్నాయి . అలానే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 150వరకు జన్ ఔషధీ కేంద్రాలు ఉన్నాయి.

అధిక జనాభా కారణంగా, భారతదేశం వైద్యుల కొరత మరియు పారామెడికల్ సిబ్బంది కొరత ఎదుర్కొంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసమై "One District, One Medical College" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ లో వైద్యరంగాన్ని బలపరచాడాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆరోగ్యరంగంలో నాణ్యత ను మెరుగుపరచడమే కాకుండా వైద్య విద్య మరియు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

కేంద్రం ఏపీకి ఇచ్చిన వరదాయిని మంగళగిరి ఎయిమ్స్

ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరతను పరిష్కరించడంలో కేంద్రం తీసుకున్న ఈ చొరవ ఎంతో కీలకమైనది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యసంరక్షణ సేవలు గణనీయంగా మెరుగుపరచడానికి ఎయిమ్స్ స్థాపన ఎంతో ఉపయోగపడింది. ఎయిమ్స్ అధునాతన వైద్య సంరక్షణ, పరిశోధన,విద్యను అందిస్తుంది. మోడీ సంకల్పంతో మంగళగిరికే తలమానికంగా ఏర్పాటు చేయబడిన ఎయిమ్స్ రాష్ట్రానికే కాకుండా మొత్తం ప్రాంతానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ప్రధానమంత్రి మాతృ వందన యోజన

1997 మరియు 2020 మధ్య సుమారు 1.3 మిలియన్ల ప్రసూతి మరణాలు సంభవించాయి. 2020లో దాదాపు 23,800మరణాలు సంభవించగా, వాటిలో 63% పేదరాష్ట్రాల్లో సంభవించాయి. అందుకే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది భారత ప్రభుత్వం. మాతృ మూర్తులకు, పసిపిల్లల కోసం ప్రారంభించిన అద్భుతమైన కార్యక్రమం ఇది. తల్లికి ఆర్థికసహాయంతో పాటు, పిల్లల ప్రారంభ టీకాలన్నీ నిర్వహించబడేవరకు ఆర్థికఆసరా అందిస్తుంది ఈ పథకం.

కేంద్ర పథకంతో బాగా తగ్గిన మాతాశిశు మరణాల రేటు

ప్రధానమంత్రి మాతృవందన యోజన గర్భిణీ మరియు పాలిచ్చే తల్లుల ఆహార అవసరాలు, ఆర్ధిక అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఇది పిండం అభివృద్ధి యొక్క కీలకదశలలో వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించడంపై దృష్టి పెడుతుంది. అలానే తల్లి మరియు బిడ్డల భద్రతను నిర్ధారిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడంలో ఈ పథకం సహాయపడింది. గర్భిణీ స్త్రీల పరీక్షలు, స్క్రీనింగ్‌ను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలను, కార్యక్రమాలను రూపొందించింది.

హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్

తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ ను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రోగనిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది.

ఏపీ ప్రజలకు అపర సంజీవనిగా కేంద్ర కార్యక్రమాలు

ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. మోడీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఏపీ ప్రజలకు అపర సంజీవనిగా మారాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో అందరి ఆరోగ్య చికిత్సలను మెరుగుపరచాలనే దృఢమైన నిబద్ధతతో చేసిన ఈ ప్రయత్నాలు నిజానికి భారతదేశపు ఆరోగ్య సంరక్షణ ముఖచిత్రాన్ని మార్చేశాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+