ప్రైవేట్ బస్సుల సంక్రాంతి బాదుడుకు చెక్.. జోరుగా తనిఖీలు; అడ్డగోలుగా దోచేస్తే కేసులేనట!!
సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ అని అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సమయంలో పట్టణాలన్నీ ఖాళీ అయ్యి పల్లెలు నిండుగా కనిపిస్తాయి. ఇక ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సమయాల్లో తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.

ప్రైవేట్ ట్రావెల్స్ పై కొరడా ఝుళిపించనున్న రవాణా శాఖ
పండుగకు పది రోజుల ముందు నుండే టిక్కెట్ల ధరలను పెంచి ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అందినకాడికి దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు ట్రావెల్స్ కు రవాణా శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులను తనిఖీ చేయాలని జిల్లాల డీటీసీలతో సమావేశం నిర్వహించిన రవాణా శాఖ కమిషనర్ ఆంజనేయులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అధిక బస్సు టికెట్ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు, తనిఖీలు షురూ
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, సంక్రాంతి పండుగ ముగిసేవరకు పది రోజులపాటు తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. విపరీతంగా ధరలు పెంచితే ప్రయాణికులు కూడా నేరుగా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఆన్లైన్లో బస్సు ఛార్జీలు ధరలను చూసి, ధరలు అధికంగా వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్, ధ్రువపత్రాలు లేని బస్సులను సీజ్ చేస్తామని, అయితే అటువంటి బస్సులను గమ్యస్థానం చేరిన తర్వాత మాత్రమే సీజ్ చేస్తామని వెల్లడించారు.

ప్రయాణికులు కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు
రవాణా శాఖ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్లకు కూడా ప్రయాణికులు ఫిర్యాదులు చేయొచ్చని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గత సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 975 కేసులు నమోదు చేసి, 62 లక్షల మేర జరిమానా విధించామని గుర్తు చేశారు. రవాణాశాఖ నిబంధనలను ఉల్లంఘించి, నేరాల తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి వారిని ప్రాసిక్యూట్ చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కు ప్రైవేట్ బస్సులు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక తాజా ఆదేశాలతో బాగా టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై కొరడా ఝుళిపించటం కోసం రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications