శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓలమ్మో ఇలా సేసినాడేటి యెదవ.!శ్రీకాకులం భక్తులను కాశ్మీర్ లో వదిలేసి పరారైన ట్రావెల్స్ బస్.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కొన్ని సార్లు కొన్ని ఘటనలు హృదయ విధారంగా పరిణమిస్తుంటాయి. అన్నీ ఉండి కూడా దిక్కులేని అనాథలుగా ఎదుటివారి సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కొన్ని సందర్బాల్లో మరీ అత్యంత దయనీయ పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శీకాకుంల జిల్లా భక్తులకు సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది. నమ్ముకున్న ట్రావెల్స్ యాజమాన్యం పచ్చి మోసం చేయడంతో పడరాని కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. సాయం కోసం తోటి వారిని అర్థిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

టూరిస్టులను నట్టేట ముంచిన ట్రావెల్స్..

టూరిస్టులను నట్టేట ముంచిన ట్రావెల్స్..

ప్రయాణీకులకు తెలియకుండా ట్రావెల్స్ యాజమాన్యం పరారవ్వడంతో అనేక ఇబ్బందులు పడ్డారు భక్తులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ట్రావెల్స్ యాజమాన్యం పరారవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ ట్రావెల్స్ సంస్థను నమ్ముకొని వెళ్లిన ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. టూరిస్టులను నట్టేట ముంచినట్లుగా శ్రీకాకులం జిల్లాకు చెందిన భక్తులందరిని ట్రావెల్ ఏజెన్సీ నిలువునా మోసం చేసింది. యాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది. దీంతో యాత్రికులు నానా యాతన పడుతున్నట్టు తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి పలువురు యాత్రికుల పర్యటన..

శ్రీకాకుళం నుంచి పలువురు యాత్రికుల పర్యటన..

కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా అకుల్ టూరిజం పేరుతో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశంలోని వేర్వేరు పుణ్యక్షేత్రాలకు, పర్యటక ప్రదేశాలకు బస్సులను నడిపిస్తుంటుంది. ప్రత్యేక ప్యాకేజీలు వసూలు చేసి యాత్రికులను గమ్యస్థానాలకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్యాకేజీని ప్రకటించారు. తెలుగువారికి గోదావరి పుష్కరాల తరహాలోనే ఉత్తరాదిన ఉండే సింధూ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఓ ప్రత్యేక ప్యాకేజీని అకుల్ టూరిజం రూపొందించారు.

అకుల్ ట్రావెల్స్ నిర్వాకం..

అకుల్ ట్రావెల్స్ నిర్వాకం..

శ్రీకాకుళం నుంచి పలువురు యాత్రికులు అకుల్ ట్రావెల్స్ యాజమాన్యం ద్వారా సింధూ పుష్కరాలకు వెళ్లారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 60 వేల రూపాయల వరకూ వసూలు చేశారు ట్రావెల్స్ యాజమాన్యం. ఇలా జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాక యాత్రికులను వదిలేసి అకుల్ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పరారయ్యారు. దీంతో దాదాపు 120 మంది యాత్రికులు దిక్కులేని వారయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని కట్రా వద్ద హోటల్లో యాత్రికులంతా చిక్కుకుపోయారు.

కశ్మీర్ హోటల్లో బంధీలుగా భక్తులు..

కశ్మీర్ హోటల్లో బంధీలుగా భక్తులు..

ఇదిలా ఉండగా భక్తులు వెళ్లిపోయేందుకు హోటల్ యాజమాన్యం అంగీకరించడం లేదు. డబ్బులు కట్టాలని 120 మందిని హోటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఒక్కొక్కరు పది వేల రూపాయలు చెల్లించాలంటూ యాత్రికులను కట్టడిచేసింది. హోటల్‌ సిబ్బంది నిర్బంధించడంతో దిక్కుతోచని స్థితిలో యాత్రికులు పడిపోనట్టు తెలుస్తోంది. హోటల్‌‌లో చిక్కుకుపోయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట వాసులు ఎక్కువగా ఉన్నారు. వారంతా తమను విడిపించాలని విజ్ఞప్తి చేస్తుస్తారు.

English summary
Many pilgrims from Srikakulam traveled to the Sindus Pushkars owned by Akul Travels. Travels ownership has charged up to Rs 60,000 from each for this. After taking the pilgrims to Jammu and Kashmir, the Akul Travel Agency representatives left the pilgrims and fled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X