నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు, వడగాల్పులతో ఏపీలో 45 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు ల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లి, ఊటుకూరులో గురువారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

Tremors in Nellore district

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఇటీవల వరుసగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో భూమి కంపించింది. నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి పరుగు తీశారు.

భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూప్రకంపనలతో నిద్ర మత్తు వదిలించుకుని ప్రాణాలు అరచేత బట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు.

వడగాల్పులతో 45 మంది మృతి

ఇప్పటి వరకు రాష్ట్రంలో వడగాల్పులతో 45 మంది మృతి చెందారని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గురువారం చెప్పారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది చనిపోయారని తెలిపారు. వడకాలుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ఒకరు, కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో పదకొండు మంది, చిత్తూరులో ముగ్గురు, అనంతపురంలో నలుగురు, కర్నూలులో ముగ్గురు చనిపోయారని చెప్పారు. అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

English summary
Panic stricken people ran out of their homes when tremors shook Nellore district in the early hours of thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X