ఈ నెల 25 న మన్యం బంద్...పోస్టర్ ఆవిష్కరణ
విశాఖపట్నం:ఈ నెల 25 న జరిగే మన్యం బంద్ కు సంబంధించి వాల్ పోస్టర్ ఆవిష్కరణ విశాఖ జిల్లా డుంబ్రిగుడలో జరిగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు.
విభజన హామీల అమలులో భాగంగా విశాఖ ఏజెన్సీలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25న గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, మన్యం యువజన సంఘం మన్యం బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ను విజయవంతం చేసి హామీల అమలుపై ధృడ సంకల్పం వెల్లడయ్యేలా అందరూ సహకరించాలని ఆయా సంఘాల ప్రతినిథులు కోరుతున్నారు.

ఈ క్రమంలో మన్యం బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్ ను విశాఖ జిల్లా డుంబ్రిగుడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నేత సూర్య నారాయణ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్‌టిలు, జిపిఎస్ పాఠశాలల్లో భాషా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికై చేపట్టే మన్యం బంద్‌లో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications