నిరుద్యోగులకు షాక్- ఒకే రోజు ఆ రెండు పరీక్షలు..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ నెల 25న గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 899పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. వీటి ప్రకారం ఈ నెల 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరగాల్సి ఉంది. ఈలోపే గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకు ఓ చిక్కు వచ్చి పడింది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పీవో ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయి మెయిన్స్ జరగాల్సి ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పీవో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఈ నెల 25నే మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకే రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు ఎస్బీఐ మెయిన్ పరీక్ష కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఇప్పుడు ఏ పరీక్ష రాయాలో తెలియని పరిస్ధితి నెలకొంది.

ఏపీలో నిరుద్యోగులు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీపీఎస్సీ ఎన్నికల వేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 25న నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎస్బీఐ పీవో మెయిన్స్ పరీక్ష కూడా జరగనుండటంతో ఇందులో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరుతున్నారు. ఇప్పుడు ఎస్బీఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు మెయిన్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ను ప్రభుత్వం వాయిదా వేస్తుందని ఆశిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications