వీడని అలక: జగన్‌కు వైవి సుబ్బారెడ్డి కుంపటి?

జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నెల 18వ తేదీన నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశానికి వైవి సుబ్బారెడ్డి హాజరు కాలేదు. సుబ్బారెడ్డి ఆ సమయంలో విదేశాల్లో ఉన్నారని, ఈ రోజు ఆయన తిరిగి వస్తారని పార్టీ అప్పుడు వివరణ ఇచ్చింది.
సమావేశం తర్వాత రోజు జగన్ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడారు. ఒక్క సీటుకే ఎందుకు పరిమితమవుతారని, పార్టీపరంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతను చూడాల్సి ఉంటుంది కదా అని జగన్ ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారని వార్తలు వచ్చాయి. అయితే, వైవి సుబ్బారెడ్డి దాంతో సంతృప్తి చెందలేదని అంటున్నారు.
ఎప్పటి నుంచో తాను ఆశ పెట్టుకున్న ఒంగోలు లోకసభ టికెట్ వచ్చేలా కనిపించడం లేదని సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన ఇప్పటికీ పార్టీకి దూరంగానే ఉంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications