నాటి వైఎస్ హామీతో నేడు పంజాబ్ లో కాంగ్రెస్ విలవిల-తెరపైకి తెచ్చిన కేజ్రివాల్
రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు తమకు అక్కరకొచ్చిన హామీల్ని ఆ తర్వాత వాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్.. ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్దితులు చూస్తే ఇది నిజమని అనిపించక మానదు. గతంలో ఏపీలో 2004లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేసిన ఓ హామీ ఇప్పుడు పంజాబ్ లో ప్రతిపక్షాలకు వరంగా మారుతుందన్న ఆందోళన కాంగ్రెస్ ను నిద్రలేకుండా చేస్తోంది.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్ధితుల్ని, వారి కష్టాల్ని నేరుగా చూసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే తాను చనిపోయే వరకూ ఆ హామీని అమలు చేశారు. మధ్యలో 2009 ఎన్నికల సందర్భంగా తాము కూడా అదే హామీని అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినా జనం నమ్మలేదు. ఇప్పుడు అదే హామీని పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఆప్ తెరపైకి తెచ్చింది.

పంజాబ్ ఎన్నికల్లో తాము గెలిస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని ఆప్ ఆధినేత అరవింద్ కేజ్రివాల్ హామీ ఇచ్చారు. దీంతో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు విపక్షంలో ఉన్న అకాలీదళ్ నేతలకు ఈ సెగ తప్పడం లేదు. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయాలనే డిమాండ్లు రైతుల నుంచి వినిపిస్తుండటం సీఎం అమరీందర్ సింగ్ కు అస్సలు మింగుడు పడటం లేదు. మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ఆయనకు ఈ ఉచిత విద్యుత్ హామీ అస్సలు రుచిచండం లేదు. అలాగని అదే హామీ తాను అమలు చేయలేరు. దీంతో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఏపీలో అధికారం కట్టబెట్టిన ఈ హామీ ఇప్పుడు పంజాబ్ లో అదే పార్టీని అధికారాన్ని దూరం చేసేలా ఉంది.












Click it and Unblock the Notifications