'వద్దన్న బాబు ముఖంతో ఓట్లడుగుతున్న బీజేపీ', 'కేసీఆర్ బెదిరింపు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లాగారు! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తెరాసలు పోటీ చేస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎవరి వ్యూహాలు వారు అనుసరిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెరాస ఉద్యోగ సంఘాలను బెదిరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్‌ను పెట్టారు. ఇది కలిసి వస్తుందని తెరాస భావిస్తోంది. ప్రధానంగా పోటీ బీజేపీ, తెరాస మధ్యనే ఉందని అంటున్నారు. ఇరువైపుల నుండి హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెరాస నుండి సీఎం కే చంద్రశేఖర రావు, మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు తదితరులు ప్రచారం చేస్తుండగా.. బీజేపీ తరఫున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పలువురు కేంద్రమంత్రులు, ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు బాధ్యతలు నెత్తిన ఎత్తుకున్నారు.

ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు కేటీఆర్ మాట్లాడుతూ.. హైకోర్టు విభజనకు చంద్రబాబే అడ్డు అన్నారు. అలాంటి వ్యక్తిని బీజేపీ నేతలు చంకన పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం ఏం కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదో రోజునే ప్రధాని మోడీకి కేసీఆర్ హైకోర్టు విషయమై లేఖ రాశారన్నారు. రాష్ట్రం సాధించిన తమకు హైకోర్టు తెచ్చుకోవడం అసాధ్యం కాదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సహచర న్యాయవాదులకే న్యాయం చేయలేకపోయారని విమర్శించారు.
చంద్రబాబు ఫోటో పెట్టుకొని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే తెలంగాణ బద్ద శత్రువైన చంద్రబాబుకు ఓటేసినట్లే అన్నారు. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సంస్కారముంటే ఉద్యమనేత దేవీప్రసాద్‌కు మద్దతివ్వాలన్నారు.
మరోవైపు, బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తెరాస పైన ఎదురు దాడికి దిగుతోంది. హైకోర్టు విభజన ఆలస్యానికి అధికార తెరాస పార్టీయే కారణమని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ సంఘాలను కేసీఆర్ బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒంటెత్తు పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదంటున్నారు.
అలాగే, తెలంగాణ ఉద్యమం సమయంలో వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన కేసీఆర్.. కేవలం ఐదు వందల మంది వరకు అమరవీరుల కుటుంబాలనే గుర్తించామని చెప్పడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్, బండారు దత్తాత్రేయ, సదానంద గౌడ తదితరులు బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నారు.
మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి, ఖమ్మం-నల్గొండ-వరంగల్‌కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెరాస తరఫున దేవీప్రసాద్ (మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి), పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఖమ్మం-నల్గొండ-వరంగల్)లు, బీజేపీ తరఫున రామచంద్ర రావు (మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి), , రామ్మోహన్ రావు (ఖమ్మం-నల్గొండ-వరంగల్)లు పోటీ చేస్తున్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications