టార్గెట్ పవన్‌కళ్యాణ్, రుసరుస: రాళ్లతో కొడ్తామని ఓయు

హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతుండటంతో... విపక్షాలు, ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా పవన్‌ను హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్‌కు ఓయూ జేఏసీ హెచ్చరిక జారీ చేసింది. పవన్ కళ్యాణ్.. జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయడానికి మెదక్ వస్తే రాళ్ల దాడి చేస్తామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారన్నారు.

పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరన్నారు. ఉద్యమపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర సమితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తోంది.

జగ్గారెడ్డి

జగ్గారెడ్డి

మెదక్ లోకసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డి నియామకం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పైన అందరు రుసరుసలాడుతున్నారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ప్రజలు కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల సమయంలోనే దిమ్మతిరిగే షాకిచ్చారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

 హరీష్ రావు

హరీష్ రావు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌చే సిఫార్సు చేసిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడం విడ్డూరమని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పవన్ తెలంగాణ వ్యతిరేకి అని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+