చంద్రబాబుతో టిఆర్ఎస్ ఎంఏల్ఏ విజయవాడలో సమావేశం, మర్మమేమిటోో

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విజయవాడలో టిఆర్ఎస్ ఎంఏల్ఏ సమావేశమయ్యారు.నిజమే మీరు చదివింది కరక్టే. టిఆర్ఎస్ ఎంఏల్ ఏ చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల మద్య లారీల రాకపోకలపై నెలకొన్న వివాదాలపై టిఆర్ఎస్ ఎంఏల్ ఏ చర్చించారు.మహాబూబ్ నగర్ ఎం ఏల్ ఏ శ్రీనివాస్ గౌడ్ చంద్రబాబుతో ఈ అంశంపై చర్చించారు.

మంగళవారం నాడు మహబూబ్ నగర్ ఎంఏల్ఏ శ్రీనివాస్ గౌడ్ విజయవాడకు వెళ్ళి లారీ అసోసియేషన్ సమస్యలపై ఎపి సిఎం చంద్రబాబునాయుడుతో చర్చించారు.సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని కోరారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని విభజన చట్టంలో కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

chandra babu

సింగిల్ పర్మిట్ విధానం లేని కారణంగా నిత్యావసర సరుకుల ధరలతో పాటు రవాణాపై ఆధారపడి ఉన్న ప్రతి వస్తువు ధర రెట్టింపు అయ్యిందన్నారు. రెండు రాష్ట్రాలు ఈ విషయమై సానుూలంగా స్పందించాలని ఆయన కోరారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనపై కూడ ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎంఏల్ ఏ బాబుతో చర్చించారు. కొన్ని శాఖల్లో ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తే కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపాలని ఆయన కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
trs mla meet ap cm chandrababu naidu on tuesday, mahaboobnagar mla srinivas goud meet chandrababu naidu for discussion on lorry association issues. he is discussion about employees bifurcation also.
Please Wait while comments are loading...