బాబును తిట్టకుంటే.., మాకు నీరిస్తే మీకే కోట్లు!: దేవినేని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావుల పైన ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మామాఅల్లుళ్లకు తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిట్టకుంటే నిద్రపట్టదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను నీటిని విడుదల చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.237 కోట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందనే విషయాన్ని గుర్తించాలని దేవినేని అన్నారు. ఏపీకి నీటిని విడుదల చేస్తే తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు.

కేసీఆర్‌కు వివరిస్తాం: అశోక్ బాబు
ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూముల్లో ఎందుకు కట్టడాలు నిర్మించలేదో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వివరిస్తామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.
ఏపీఎన్జీవో భూముల్లో తెలంగాణ ఉద్యోగులు వాటాలు అడుగుతున్నారన్నారు. అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని, అలాంటిదానిలో వాటాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాగా, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications