Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సత్యప్రమాణాల రగడ.. కాణిపాకంలో బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డి , వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి ఏం చేస్తారో ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్య ప్రమాణాల రాజకీయం కాక రేపుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు ఆలయాల్లో సత్య ప్రమాణాల దాకా వెళుతున్నాయి. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ దేవుళ్లతో గేమ్స్ ఆడేస్తున్న తీరు ఏపీ వాసులలో చర్చనీయాంశం కాగా, తాజాగా మరోమారు కాణిపాకంలో సత్య ప్రమాణాలు వ్యవహారం కాక రేపుతోంది.

అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేల సత్యప్రమాణాల రగడ

అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేల సత్యప్రమాణాల రగడ

గతంలో అనపర్తి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సత్య ప్రమాణాలు దాకా వెళ్లారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో భార్యతో కలిసి వెళ్లి అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి స్వామివారి ముందు సత్య ప్రమాణం చేశారు .దీంతో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా సతీసమేతంగా ఆలయానికి వెళ్లి లక్ష్మీ గణపతి ముందు సత్య ప్రమాణం చేశారు. ఇద్దరు నేతల సత్య ప్రమాణాల నేపధ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు 144సెక్షన్ విధించి పరిస్థితిని పర్యవేక్షించారు .

సాయిరెడ్డి, వెలగపూడి మధ్య సత్య ప్రమాణాల ఛాలెంజ్

సాయిరెడ్డి, వెలగపూడి మధ్య సత్య ప్రమాణాల ఛాలెంజ్

ఆ తర్వాత విశాఖ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వెలగపూడి రామకృష్ణబాబు సాయిబాబా గుడిలో సత్య ప్రమాణం చేయాలని విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు. ఇక విజయసాయిరెడ్డి తరపున సత్య ప్రమాణం చేయడానికి ఆ పార్టీ తూర్పు ఇన్చార్జి విజయనిర్మల ముందుకు రావడంతో విశాఖ తూర్పు నియోజకవర్గ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. అప్పుడు కూడా వారి మధ్య వివాదం రచ్చ రేపింది.

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదంతో మొదలైన బీజేపీ వర్సెస్ వైసీపీ

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదంతో మొదలైన బీజేపీ వర్సెస్ వైసీపీ

ఇక తాజాగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో బీజేపీ, వైసీపీ శ్రేణుల మధ్య సత్య ప్రమాణాలు చాలెంజ్ ఉద్రిక్తతకు కారణమయ్యేలాగా కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు వ్యవహారంపై సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్న బిజెపి, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలకు దిగారు. వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ముఖ్యంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగింది. ఇది చివరకు సత్య ప్రమాణాల దాకా వెళ్ళింది. ఇప్పుడు కాణిపాకం వేదికగా వారి సత్యప్రమాణాల రగడ కొనసాగుతోంది.

విష్ణు వర్ధన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే , సత్య ప్రమాణానికి రెడీ అన్న బీజేపీ నేత

విష్ణు వర్ధన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే , సత్య ప్రమాణానికి రెడీ అన్న బీజేపీ నేత

తనపై వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక వైసీపీ ఎమ్మెల్యే సైతం సత్య ప్రమాణానికి రావాలని ఛాలెంజ్ విసిరారు. ఈరోజు కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ శ్రేణులతో కాణిపాకం కి వెళ్లారు. ఇక బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ చేసినప్పటికీ ఆ సవాల్ కు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించలేదు.

కాణిపాకంలో విష్ణువర్ధన్ రెడ్డి .. సత్య ప్రమాణం చేస్తానని వెల్లడి

కాణిపాకంలో విష్ణువర్ధన్ రెడ్డి .. సత్య ప్రమాణం చేస్తానని వెల్లడి

ఇక ఇదే విషయాన్ని విష్ణు వర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గతంలో నేను ప్రకటించిన ప్రకారం నేడు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం సన్నిధిలో ప్రమాణం చేయబోతున్నాను. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నాపై చేసిన అవినీతి ఆరోపణల మీద , నా సచ్ఛీలతపైన ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే గారికి బహిరంగ ఆహ్వానాన్ని ముందే పంపాను అంటూ పేర్కొన్నారు. ఒక సాధారణ భక్తుడిగా కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనంచేసుకోవడానికి పోలీసులు,రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలను కలిగించకుండా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న మాట ప్రకారం నేను ప్రమాణం చేయబోతున్నాను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యే గారు రావడం రాకపోవడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.

సత్యప్రమాణాలకు అనుమతి లేదన్న పోలీసులు , భారీగా బందోబస్తు

సత్యప్రమాణాలకు అనుమతి లేదన్న పోలీసులు , భారీగా బందోబస్తు

ఇదిలా ఉంటే కరోనా కారణంగా కాణిపాకం ఆలయంలోకి వెళ్ళడానికి అనుమతి లేదని సత్య ప్రమాణాలకు అవకాశం లేదని పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డి నిలువరించారు. ప్రస్తుతం కాణిపాకంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల లోపు సత్య ప్రమాణాలు చేస్తామని వెల్లడించి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకే కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేస్తానని ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి స్పందిస్తారా ? ఏం జరుగుతుందో అని ఉత్కంఠ

వైసీపీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి స్పందిస్తారా ? ఏం జరుగుతుందో అని ఉత్కంఠ

అయితే పోలీసులు సత్య ప్రమాణాలకు అనుమతి లేదని, దైవ దర్శనానికి వస్తే అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. మరి ఇంతకీ బిజెపి వైసిపి నేతల మధ్య చోటుచేసుకున్న సత్య ప్రమాణాల ఛాలెంజ్ ఈరోజు కాణిపాకం వేదికగా ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. అసలు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాణిపాకం ఆలయానికి వస్తారా ? ఆయన విష్ణు వర్ధన్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించారా ? అనేది తెలియాల్సి ఉంది. తాజా పరిణామాల నేపధ్యంలో ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో ? పోలీసులు వీరి సత్య ప్రమాణాలను అనుమతిస్తారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+